BJP | ప్రభుత్వ రెసిడెన్షియల్ జూ.కళాశాలలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఆందోళ‌న‌

BJP కనీస సౌకర్యాలు కల్పించాలని బిజెపి నాయకురాలు సుహాసిని రెడ్డి డిమాండ్‌ లేదంటే ఆందోళ‌న‌లు ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రిక‌ విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు.. విద్యార్థినుల తల్లిదండ్రుల కోరిక మేరకు కళాశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం […]

BJP | ప్రభుత్వ రెసిడెన్షియల్ జూ.కళాశాలలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఆందోళ‌న‌

BJP

  • కనీస సౌకర్యాలు కల్పించాలని బిజెపి నాయకురాలు సుహాసిని రెడ్డి డిమాండ్‌
  • లేదంటే ఆందోళ‌న‌లు ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రిక‌

విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు..

విద్యార్థినుల తల్లిదండ్రుల కోరిక మేరకు కళాశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జాతీయ రహదారిపై బైఠాయించడంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. కళాశాలలో కనీస వసతులు కరువయ్యాయి అని, మరుగు దొడ్లు లేక పోవడంతో బయటకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దాంతో పిల్లలకి రక్షణ కరువయ్యిందని అన్నారు .
విద్యార్థినిలకు ఏదైనా అనుకొని సంఘటన ఎదురైతే దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, వసతి గృహం ఆవరణలో మురికి నీరు చేరి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఆమె వెంట నాయకులు మండల అధ్యక్షులు కేంద్ర నారాయణ,జిల్ల ఉపాధ్యక్షులు బాబరావు పటేల్ కదం, సోషల్ మీడియా కన్వీనర్ జాదవ్ రాము, క్రాంతి కుమార్, సంతోష్ కొత్తపెళ్లి, సతీష్ రెడ్డి, అశాంత్ తదితరులు ఉన్నారు.