BJP | రైతులకు కేసీఆర్ ద్రోహం: ప్రేమెందర్‌రెడ్డి ధ్వజం

BJP విధాత: సీఎం కేసీఆర్ ఎన్నికలలో రైతులకు ఇచ్చిన లక్ష రుణమాఫీ చేయకుండా రైతాంగానికి ద్రోహం చేస్తున్నారని, పదవీ కాలం దగ్గరపడుతున్నందున ఇప్పటికైనా తన హామీని అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమెందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ బీజేపీ కార్యాలయం ముందు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన హాజరై మాట్లాడారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న కేసీఆర్ తన హామీని మరిచారన్నారు. […]

BJP | రైతులకు కేసీఆర్ ద్రోహం: ప్రేమెందర్‌రెడ్డి ధ్వజం

BJP

విధాత: సీఎం కేసీఆర్ ఎన్నికలలో రైతులకు ఇచ్చిన లక్ష రుణమాఫీ చేయకుండా రైతాంగానికి ద్రోహం చేస్తున్నారని, పదవీ కాలం దగ్గరపడుతున్నందున ఇప్పటికైనా తన హామీని అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమెందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ బీజేపీ కార్యాలయం ముందు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన హాజరై మాట్లాడారు.

రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న కేసీఆర్ తన హామీని మరిచారన్నారు. 24గంటల ఉచిత విద్యుత్ సగం గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. ధాన్యం కొనుగోలులో సైతం విఫలమవ్వగా కేంద్రం ఆదుకుని రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలుకు సహకరించిందన్నారు. రాష్ట్ర రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వ్యవసాయ యాంత్రీక పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్‌, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గోలి మధుసూధన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి, నాయకులు వీరెల్లి చంద్రశేఖర్‌, పోతేపాక సాంబయ్య, నాగం వర్షిత్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, పాలకూరి రవి తదితరులు పాల్గొన్నారు.