Errabelli Pradeep Rao | ఎమ్మెల్యే భూకబ్జాలతో కోట్లు సంపాదించుకుంటున్నారు: బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్ర విమర్శ

Errabelli Pradeep Rao | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలం అయ్యారన్నారనీ బిజెపి రాష్ట్ర నాయకులు విమర్శించారు. వరంగల్లో ఆదివారం ఇంటింటికీ బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో వరంగల్ అర్భన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, పార్టీ సీనియర్ […]

  • By: krs    latest    Jun 11, 2023 12:11 PM IST
Errabelli Pradeep Rao | ఎమ్మెల్యే భూకబ్జాలతో కోట్లు సంపాదించుకుంటున్నారు: బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్ర విమర్శ

Errabelli Pradeep Rao |

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలం అయ్యారన్నారనీ బిజెపి రాష్ట్ర నాయకులు విమర్శించారు. వరంగల్లో ఆదివారం ఇంటింటికీ బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో వరంగల్ అర్భన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు కుసుమ సతీష్, వన్నాల వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ గత వర్షాకాలంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కనీస మరమ్మతులు చేయాల్సిన స్థానిక ఎమ్మెల్యే, ప్రజల కోసం ఆలోచించకుండా వారి పార్టీ కార్యాలయం కోసం మాత్రమే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

వర్షాలకు ఇల్లు కూలిపోయి కాలనీలో ఇల్లు నీళ్లతో నిండిపోయి వ్యధ అనుభవించిన కుటుంబాలను ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం నేటికీ నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. కరోనా సమయంలో ఎమ్మెల్యే వివిధ కుల సంఘాల వద్ద లక్షల్లో చందాలు వసూలు చేసి అందులో కొంత ఖర్చుచేసి మొత్తం తానే సహాయం చేసానని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు.

అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానికి ఎమ్మెల్యేను చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే భూకబ్జాలకు పాటుపడుతూ కోట్లు సంపాదించుకుంటున్నారు.

భూకబ్జాలకు పాల్పడితే ముక్కునేలకు రాస్తానని చెబుతున్న ఎమ్మెల్యేకు మావోయిస్టులు లేఖ ఎందుకు రాశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ నాయకుల దౌర్జన్యాలకు భయపడే కార్యకర్తలు మా బిజెపిలో లేరన్నది అధికార పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.