విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్టపగలు దొరికిపోయన బీజేపీ దొంగల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన మఠాధిపతులు, స్వామిజీలు మాకు తెలియదని బుకాయించారు. మారు వేషాల్లో వచ్చిన మఠాధిపతులు, స్వామిజీలు తమకు తెల్వనే తెల్వదని బీజేపీ నాయకులు చెప్పారు. ప్రభుత్వం వారిని అరెస్టు చేసి, జైలుకు పంపిన తర్వాత బీజేపీ నాయకుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైంది.
పార్టీ అధ్యక్షుడేమో తడి బట్టలతో ప్రమాణం చేస్తానని అంటాడు. ఈ కేసును విచారణ చేయొద్దని బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంటాడు. ఈ కేసు విచారణ ఆపండి. ఢిల్లీకి ఇవ్వండంటూ కోర్టుల్లో పిటిషన్ వేస్తాడు. తడిబట్టలు, పొడిబట్టలు, ప్రమాణాలు, కేసు విచారణ ఆపాలనేమో పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టుల్లో కేసులు వేస్తాడు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టి తెలంగాణకు వచ్చేసరికి కుడితిలో పడ్డంత పనైంది. తెలంగాణలో వారిని నగ్నంగా ప్రభుత్వం భయపెట్టింది. ఆ దొంగలను ప్రభుత్వం జైల్లో పెట్టింది. దీంతో వారు ఆగమాగం అవుతున్నారు. నిద్ర కూడా పోతలేన్నట్టుంది. 24గంటలు కోర్టుల చుట్టు తిరుగుతున్నారు.
మీకు సంబంధం లేకపోతే కోర్టుల తలుపులు ఎందుకు కొడుతున్నారు. ఈ కేసుతో మాక సంబంధం లేదని టీవీ చర్చల్లో చెబుతున్నారు. వారెవరో తెలియదని, వారిని కేసీఆరే పంపిండని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి సంబంధం లేకపోతే బీజేపీ ప్రధాన కార్యదర్శి సిట్‌ను రద్దు చేయమని ఎందుకు అడుగుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు. మొన్ననేమో ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని ప్రేమేందర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఇవాళ్నేమో పాదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో సిట్ ఏర్పాటు చేస్తే, రద్దు చేయాలని కోర్టులో కేసు వేశారు.
బీజేపీ బండారం బయటపడుతదనో ఉద్దేశంతో, దీన్ని ఆపాలని చూస్తున్నారు. పరువు కాపాడుకుందామని విచారణ ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజాన్ని ఒప్పుకోవడమే మీ ముందున్న మార్గం. మరో గత్యంతరం లేదు. బీజేపీ నాయకులను ప్రజలు గమనిస్తున్నారు. కేసుతో సంబంధం లేకుండా కార్యదర్శి కేసులు ఎందుకు వేస్తున్నారు. ఢిల్లీ, గల్లీ నాయకులు గత్తర గత్తర అవుతున్నారు. కేసు త్వరగా విచారణ జరగాలని, నిజ నిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తారు. కానీ దర్యాప్తు మీద స్టే ఇవ్వాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా బీజేపీ బ్రోకర్ల వీడియోల గురించి ప్రస్తావించారు.
తుషార్ పేరు ఎందుకు ప్రస్తావించారో తెలియదు.
మేం మాట్లాడిందేమో రాహుల్ గాంధీ మీద పోటీ చేసి ఓడిపోయిన తుషార్ గురించి. ఆమెనేమో తన వ్యక్తిగత ఏడీసీ తుషార్ గురించి మాట్లాడారు. తుషార్ ప్రస్తావన ఎందుకు తెచ్చిందో అర్థం కాలేదు. ఆ విషయాన్ని ఇవాళ మేం పత్రికల్లో చూశాం. బీజేపీ నాయకులకు తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం లేదా? తెలంగాణ పోలీసుల మీద కుట్రపూరితమైన వైఖరిని బీజేపీ అవలంభిస్తుంది.
దొంగను పట్టుకోవడం తప్పా? ఎమ్మెల్యేలను కొంటామని చెప్పిన తర్వాత వారిని అరెస్టు చేయడం తప్పా? గంటకో మాట మాట్లాడుతున్నారు. దొరికి పోయి పూటకో మాట మాట్లాడుతున్నారు. కోర్టుల్లో ఒకటి, ప్రెస్‌మీట్లలో ఒకటి, టీవీ చర్చల్లో ఒకటి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకుల బహురూప వేషాలను, నాటకాలను తెలంగాణ ప్రజలు గమనించాలి. నగ్నంగా దొరికిపోయి, బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు.
సంబంధం లేని కేసు అయితే ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు. ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. చిత్తశుద్ధి ఉంటే విచారణకు సహకరించండి. బీజేపీ నాయకులు దొరికిపోయిన దొంగలు. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ధర్మం, న్యాయం గెలుస్తుందన్న విశ్వాసం మాకుంది