చేతితో మరుగుదొడ్డిని శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ (VIDEO)
విధాత: ఓ బీజేపీ ఎంపీ తన ఎడమ చేత్తో మరుగుదొడ్డిని శుభ్రం చేశాడు. ఓ ప్రభుత్వ పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్‌ను క్లీన్ చేసి సదరు ఎంపీ వార్తల్లో నిలిచాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖటారియా బాలికల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా ఈ నెల 17న బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో సేవా పఖ్‌వాడా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అపరిశుభ్రంగా […]

విధాత: ఓ బీజేపీ ఎంపీ తన ఎడమ చేత్తో మరుగుదొడ్డిని శుభ్రం చేశాడు. ఓ ప్రభుత్వ పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్‌ను క్లీన్ చేసి సదరు ఎంపీ వార్తల్లో నిలిచాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖటారియా బాలికల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా ఈ నెల 17న బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో సేవా పఖ్‌వాడా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను క్లీన్ చేస్తున్నారు.
ఇక ఇవాళ మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా చక్‌దేవ్‌పూర్‌లోని ఖటారియా బాలికల ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడ మొక్కలు నాటిన అనంతరం అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్డిని, బీజేపీ ఎంపీ తన ఎడమ చేత్తో శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎంపీ వ్యవహారంపై పలువురు నెటిజన్లు మండి పడుతున్నారు.
రాజకీయ స్టంట్ అని, స్కూల్ పిల్లలతో టాయిలెట్ క్లీనింగ్‌ను కప్పి పుచ్చేందుకు ఆయన ఇలా చేశారంటూ పలువురు విమర్శించారు. గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను 5,6 తరగతులు చదువుతున్న బాలికలతో గత మంగళవారం శుభ్రం చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.