Prakash Javadekar | రానుంది BJP రాజ్య‌మే: మాజీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌

తొమ్మిందేండ్ల‌లో ఒక్క మంత్రి, ఎంపీపై అవినీతి ఆరోప‌ణ‌లు లేవు బండి సంజ‌య్ అడుగ‌గానే కేంద్ర‌మంత్రి నిధులు మంజూరు చేశారు కేసీఆర్ కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు నిర్మాణాలు త‌క్కువ‌, అవినీతి ఎక్కువ‌ కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌ విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ గత యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం తక్కువ,అవినీతి ఎక్కువ అని కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ (Prakash Javadekar) ఆరోపించారు. సిద్దిపేట - ఎల్కతుర్తి […]

  • Publish Date - June 12, 2023 / 10:42 AM IST
  • తొమ్మిందేండ్ల‌లో ఒక్క మంత్రి, ఎంపీపై అవినీతి ఆరోప‌ణ‌లు లేవు
  • బండి సంజ‌య్ అడుగ‌గానే కేంద్ర‌మంత్రి నిధులు మంజూరు చేశారు
  • కేసీఆర్ కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు నిర్మాణాలు త‌క్కువ‌, అవినీతి ఎక్కువ‌
  • కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ గత యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం తక్కువ,అవినీతి ఎక్కువ అని కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ (Prakash Javadekar) ఆరోపించారు. సిద్దిపేట – ఎల్కతుర్తి 765 డీఎల్ జాతీయ రహదారి నిర్మాణానికి 578 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

గ‌త 9 సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులకు లక్ష కోట్లు కేటాయించిందని, తాను ఎంపీగా అయినప్పటి నుండి నాలుగేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 వేల కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని చెప్పారు. బండి సంజయ్ అడగ్గానే కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సిద్దిపేట – ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించారన్నారు.

తెలంగాణలో 1948 నుండి 2014 వరకు జాతీయ రహదారుల నిర్మాణానికి కేవలం 2,500 కోట్లు కేటాయిస్తే, కేవలం ఈ 9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం జాతీయ రహదాల నిర్మాణానికి 2,500 కోట్లు కేటాయించింద‌న్నారు. 9 ఎండ్ల మోడీ పాలనలో కేంద్రంలోని ఒక్క మంత్రిపై, ఎంపీపై అవినీతి ఆరోపణలు రాలేద‌న్నారు.

యూపీఏ ప్రభుత్వం కంటే రెండింతలు ఈ 9 ఎండ్లలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగింద‌ని, తెలంగాణ కోసం ఆనాడు తాము కూడా కేంద్రంలో పోరాటం చేశాం, కానీ తెలంగాణలో ఇప్పుడు ఒకే కుటుంబం అవినీతి పాలన కొనసాగిస్తుందని విమ‌ర్శించారు.

తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి వేయి 900 కోట్లు కేటాయించిందని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయ‌న జోష్యం చెప్పారు.