Urvashi Rautela | పవన్ కల్యాణ్‌ను ‘ఏపీ సీఎంగా’ పేర్కొన్న బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి..! నెటిజన్ల స్పందన ఇదీ..!
Urvashi Rautela | పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ప్రత్యేక గీతంలో నర్తించింది. ‘మై డియర్ మార్కండేయ’ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ మామా అల్లుళ్లతో కలిసి చిందులేసింది. చిత్రం విడుదల నేపథ్యంలో ఊర్వశి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను […]
Urvashi Rautela |
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ప్రత్యేక గీతంలో నర్తించింది. ‘మై డియర్ మార్కండేయ’ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ మామా అల్లుళ్లతో కలిసి చిందులేసింది.
చిత్రం విడుదల నేపథ్యంలో ఊర్వశి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రిగా పేర్కొంటూ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‍తో కలిసి దిగిన ఫొటోను ఇన్‍స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘బ్రో సినిమా కోసం ఏపీ సీఎం పవన్ కల్యాణ్‍తో స్క్రీన్ పంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. బ్రో సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
తన తప్పులను సరిదిద్దుకునేందుకు చావు తర్వాత రెండో అవకాశం లభించిన వ్యక్తి గురించిన కథే బ్రో మూవీ’ అంటూ పేర్కొంది. ఈ ప్రస్తుతం ఊర్వశి చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ సీఎం సీఎం అని పవర్ కల్యాణ్ అభిమానులు అరవడంతో పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి అని భావించి ఉండవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
అయితే, ఊర్వశి పోస్టును చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊర్వశి నిజమే చెప్పిందని, ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణే అంటూ స్పందిస్తున్నారు. దాంతో పాటు ఊర్వశి చేసిన పోస్టును వైరల్ చేస్తున్నారు.
అయితే, ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి అని, ఈ విషయం ఊర్వశికి తెలిసి ఉండదని ఓ యూజర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఏపీలో పర్యటిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా వారాహి విజయ యాత్ర నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై మాటల దాడిని పెంచుతూ.. పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల తనకు సీఎం కావాలన్న ఆకాంక్ష ఉందని.. తనకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే సీఎం అవుతానని పేర్కొన్నారు.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram