స‌రిహ‌ద్దుల్లో డ్రోన్లు.. కాల్పులు జ‌రిపిన BSF జ‌వాన్లు

విధాత : పాకిస్తాన్ వైపు నుంచి భార‌త్ స‌రిహ‌ద్దుల్లోకి వ‌చ్చిన డ్రోన్ల‌ను బీఎస్ఎఫ్ జ‌వాన్లు గుర్తించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన బ‌ల‌గాలు ఆ డ్రోన్ల‌పై ఐదు రౌండ్ల‌ కాల్పులు జ‌రిపారు. గుర్‌దాస్‌పూర్ సెక్టార్ వ‌ద్ద నిన్న రాత్రి రెండు డ్రోన్లు క‌నిపించాయ‌ని పోలీసులు తెలిపారు. భార‌త భూభాగంలో 19 నిమిషాల పాటు ఆ రెండు డ్రోన్లు ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నాయి. అయితే అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల‌కు 100 మీట‌ర్ల దూరంలో డ్రోన్‌లు ఉన్న‌ట్లు నిర్ధారించారు. డ్రోన్ల‌ను గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు […]

స‌రిహ‌ద్దుల్లో డ్రోన్లు.. కాల్పులు జ‌రిపిన BSF జ‌వాన్లు

విధాత : పాకిస్తాన్ వైపు నుంచి భార‌త్ స‌రిహ‌ద్దుల్లోకి వ‌చ్చిన డ్రోన్ల‌ను బీఎస్ఎఫ్ జ‌వాన్లు గుర్తించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన బ‌ల‌గాలు ఆ డ్రోన్ల‌పై ఐదు రౌండ్ల‌ కాల్పులు జ‌రిపారు. గుర్‌దాస్‌పూర్ సెక్టార్ వ‌ద్ద నిన్న రాత్రి రెండు డ్రోన్లు క‌నిపించాయ‌ని పోలీసులు తెలిపారు. భార‌త భూభాగంలో 19 నిమిషాల పాటు ఆ రెండు డ్రోన్లు ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నాయి. అయితే అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల‌కు 100 మీట‌ర్ల దూరంలో డ్రోన్‌లు ఉన్న‌ట్లు నిర్ధారించారు. డ్రోన్ల‌ను గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు త‌నిఖీలు చేశారు. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్, స్థానిక పోలీసు స్టేష‌న్ల‌ను బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం చేశాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.