సీఎంకు చేదు అనుభవం.. ర్యాలీలో బాటిల్ దాడి
విధాత : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్‌లో చేదు అనుభవం ఎదురైంది. రాజ్‌కోట్ సిటీలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ సభా వేదిక వద్దకు వస్తున్నారు. ర్యాలీగా వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి.. కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్‌ను విసిరారు. అయితే ఆ బాటిల్ కేజ్రీవాల్‌కు తగల్లేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. గత […]

విధాత : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్‌లో చేదు అనుభవం ఎదురైంది. రాజ్‌కోట్ సిటీలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ సభా వేదిక వద్దకు వస్తున్నారు. ర్యాలీగా వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి.. కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్‌ను విసిరారు. అయితే ఆ బాటిల్ కేజ్రీవాల్‌కు తగల్లేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. గత నెలలో వడోదర పర్యటనకు వచ్చిన సందర్భంగా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా, మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.
గుజరాత్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తున్నట్లు కేజ్రీవాల్ గతంలో ప్రకటించారు. దీంతో ఆప్ నేతలు, కార్యకర్తలు.. గుజరాత్‌లో యాక్టివ్‌గా ప్రచారం చేస్తున్నారు. గుజరాత్‌లో గెలవబోయేది ఆప్ అని అరవింద్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లో ఆప్ అధికారంలోకి రాగానే.. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. కచ్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు నర్మదా నది నుంచి సురక్షితమైన తాగునీరు అందిస్తామన్నారు. గుజరాత్‌లోని 33 జిల్లాల్లో గవర్నమెంట్ ఆస్పత్రులను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆప్ అధినేత హామీల వర్షం కురిపిస్తున్నారు.