RRR: ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న జీ 20 సమ్మిట్‌లో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సాల్వా పాల్గొనగా, ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్నో ఫన్నీ సీన్స్ ఉన్నాయని చెప్పిన ఆయన, ఇది మూడు గంటల ఫీచర్ ఫిల్మ్ అని అలానే అందులో డ్యాన్స్‌లు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ చిత్రంలో బ్రిటిష్ రూలింగ్ పై ఓ లోతైన విమర్శ ఉంది. ఇండియా గురించి ఎవరు ప్రస్తావన తీసుకువచ్చినా సరే మీరు ఆర్ఆర్ఆర్ మూవీ చూశారా అని అడుగుతున్నా అంటూ లూలా స్పష్టం చేశారు. అయితే బ్రెజిల్ అధ్యక్షుడు మాట్లిడిన మాటలకి సంబంధించిన వీడియోని ఆర్ఆర్ఆర్ టీం ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది.
రాజమౌళితో పాటు చిత్ర బృందానికి బ్రెజిల్ అధ్యక్షుడు బెస్ట్ విషెస్ అందిచండంతో రాజమౌళి ఆయన మాటలకు రిప్లై ఇస్తూ దండం పెట్టాడు. రాజమౌళి తన ట్వీట్‌లో మీ మాటలకు, మీరు వర్ణించిన తీరుకు థాంక్స్ సర్ అని తెలియజేశాడు. ఇండియన్ సినిమా గురించి మాట్లాడటం, ఆర్ఆర్ఆర్ గురించి చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని స్పష్టం చేశాడు. మీ మాటలతో మా టీం తెగ ఉబ్బితబ్బిబవుతుంది. ఇండియాలో ఉన్న ఈ టైంను మీరు చాలా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నామంటూ రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకి బ్రెజిల్ అధ్యక్షుడే అంతలా ఫిదా అయ్యాడంటే అది మామూలు విషయం కాదని నెటిజన్స్ అనిఅంటున్నారు.
ఎన్టీఆర్,రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా దేశవిదేశాలకి చెందిన ఎంతోమంది ప్రముఖులని ఎంతగానో అలరించింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం ఆర్ఆర్ఆర్‌ను మెచ్చుకోవడం మనం చూశాం. ఇక రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల గురించి అంతర్జాతీయ మీడియా చాలా గొప్పగా రాసింది. ఇక చివరకు ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోవడంతో పాటు సంభ్రమాశ్చర్యాలకి గురైంది.