కాంగ్రెస్‌కు BRS B-టీమ్: BJP నేత తరుణ్‌చుగ్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిస్తే తాను పార్టీ వీడుతానన్న రేవంత్‌రెడ్డి.. ఆ టైం దగ్గరల్లోనే ఉన్నది మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు ఖర్చపెట్టినా ఇంటింటికీ రాని నీళ్లు విధాత: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలిసి సాగాలని చూస్తుంటే.. తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను విపక్షంలో కూర్చోబెట్టాలని నిర్ణయించారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ విమర్శించారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన కోర్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి […]

- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిస్తే తాను పార్టీ వీడుతానన్న రేవంత్‌రెడ్డి.. ఆ టైం దగ్గరల్లోనే ఉన్నది
- మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు ఖర్చపెట్టినా ఇంటింటికీ రాని నీళ్లు
విధాత: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలిసి సాగాలని చూస్తుంటే.. తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను విపక్షంలో కూర్చోబెట్టాలని నిర్ణయించారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ విమర్శించారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన కోర్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి బీజేపీ సంస్థాగత సహ కార్యదర్శి ప్రకాశ్, తరుణ్‌చుగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, చేవెళ్ల బహిరంగ సభ, చేరికలు, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి కావాలని దేశవ్యాప్తంగా డజన్ మంది నేతలు యాత్రలు చేస్తున్నారని తరుణ్‌చుగ్ విమర్శించారు. ఇందులో భాగంగానే కేసీఆర్ కూడా పగటి కలలు కంటూ దేశవ్యాప్తంగా యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కూటమి కట్టేందుకు యత్నిస్తుంటే తెలంగాణలో మాత్రం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారు? బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు బీ టీమ్ అని, ఆ రెండు పార్టీలు కలిసి నడుస్తాయన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిస్తే తాను పార్టీ వీడుతానని రేవంత్‌రెడ్డి చెప్పారని, ఆయన పార్టీని వీడే సమయం దగర్గలోనే ఉన్నదని తరుణ్‌చుగ్ అన్నారు.
సంజయ్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చుచేసినా రాష్ట్రంలో ఇంటింటికి మంచి నీళ్లు రావడం లేదని విమర్శించారు. ఈ నెల 28 పార్లమెంటరీ ప్రవాస్ యోజన్‌లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అమిత్ షా చేవెళ్లకు రాబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం పై కోర్‌కమిటీలో చర్చించినట్టు ఆయన చెప్పారు.