Nalgonda | ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముట్టడి.. బీజేపీ నేతల అరెస్టులు

Nalgonda | విధాత: బీఆరెస్ ఎన్నికల హామీల అమలు వైఫల్యాలను నిరసిస్తు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడిని నిర్వహించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట సాగింది. పోలీసుల లాఠీచార్జీలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు […]

  • Publish Date - August 23, 2023 / 10:58 AM IST

Nalgonda | విధాత: బీఆరెస్ ఎన్నికల హామీల అమలు వైఫల్యాలను నిరసిస్తు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడిని నిర్వహించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట సాగింది. పోలీసుల లాఠీచార్జీలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్ధు, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవి, గోలి మధుసూధన్‌రెడ్డి, నాయకులు పోతేపాక సాంబయ్య, నాగం వర్షిత్‌రెడ్డి, పాలకూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.