Upi Payments: యూపీఐ చెల్లింపులపై చార్జ్.. కేంద్రం యోచన
Upi Payments: సామాన్యుడిపై భారం మోపేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. చిన్న మొత్తాల నుంచి భారీ కొనుగోళ్లకు సైతం ప్రజలు యూపీఏ చెల్లింపులే చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి కేంద్రప్రభుత్వం నుంచి సంబంధిత యాప్ ల నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు.
దీంతో చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు సైతం యూపీఐ చెల్లింపుల మీదే ఆధారపడుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ. 3000కు మించిన చెల్లింపుల మీద చార్జ్ వసూలు చేయబోతున్నట్టు సమాచారం. ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం జీరో ఎండీఆర్ అమల్లో ఉండటంతో ప్రజల మీద ఎటువంటి భారం పడటం లేదు. కేంద్రం ఇటువంటి ఈ నిర్ణయం తీసుకుంటే సామాన్యుల మీద భారం పడే అవకాశం ఉంది. చిన్న చిన్న కిరాణాదుకాణాల యజమానులు యూపీఐ విధానాన్ని పక్కనపెట్టి.. పాత పద్ధతిలోనే క్యాష్ తీసుకొనే అవకాశమూ లేకపోలేదు. మరి డిజిటల్ లావాదేవీలు పెంచాలన్న కేంద్ర లక్ష్యం నీరు గారే ప్రమాదం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram