Chandrababu
విధాత: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్నమయ్య జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. పుంగనూరు రోడ్డుషోకు వెళుతున్న చంద్రబాబు నాయుడిని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలో పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసేందుకు లాఠీఛార్జ్, భాష్పాయువు ప్రయోగించారు.
ఈ క్రమంలో పోలీసుల మీదకు టీడీపీ శ్రేణులు రాళ్లు విసిరారు. ఈ ఘటన పై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టమనీ, పుంగనూరులో రావనాసురిడి వంటి ఎమ్మెల్యే ఉన్నారన్నారు. తాను చిత్తూరులోనే పుట్టానని, కర్రలతో వస్తే కర్రతో వస్తా రౌడీలతో వస్తే రౌడీగా వస్తానని హెచ్చారించారు. బాంబులకే బయపడలేదని రాళ్లకు భయపడతానాని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టనట్లు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు పోలీసుల అండతో దాడులకు పాల్పడుతున్నారన్నారు.