Cheetah | బాయ్ ఫ్రెండ్ ఒబాన్ కోసం.. కునో పార్కు దాటిన ఆశా

విధాత: ఎవరీ ఆశా? ఎవరీ ఒబాన్ అనుకుంటున్నారా? ఇటీవల కునో జాతీయ పార్కు నుంచి నివాస ప్రాంతాల్లోకి వచ్చిన మగ చిరుతే ఒబాన్ (Cheetah). కొన్ని రోజులుగా ఒబాన్ కనిపించక పోయేసరికి వెతుక్కుంటూ పార్క్ దాటిన ఆడ చిరుత ఆశా. #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan releases the second batch of 12 Cheetah brought from South Africa, to their new home Kuno National Park […]

Cheetah | బాయ్ ఫ్రెండ్ ఒబాన్ కోసం.. కునో పార్కు దాటిన ఆశా

విధాత: ఎవరీ ఆశా? ఎవరీ ఒబాన్ అనుకుంటున్నారా? ఇటీవల కునో జాతీయ పార్కు నుంచి నివాస ప్రాంతాల్లోకి వచ్చిన మగ చిరుతే ఒబాన్ (Cheetah). కొన్ని రోజులుగా ఒబాన్ కనిపించక పోయేసరికి వెతుక్కుంటూ పార్క్ దాటిన ఆడ చిరుత ఆశా.

మనవాళ్లు అనుకున్న వాళ్లు కనిపించకుండా పోతే వెతకడం మానవ సహజం. ఇదే బంధం జంతువుల మధ్య కూడా ఉంటుందనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నది ఒబాన్, ఆశాల అనుబంధం. వీటి అనుబంధం సంగతెలా ఉన్నా.. ఇప్పటికే మగ చిరుతను తిరిగి పార్కులోకి రప్పించేందుకు నానా ఇబ్బందులు పడుతున్న అటవీశాఖ అధికారులు.. ఈలోపే ఆడ చిరుత కూడా పార్క్ వదిలి వెళ్లడంతో కంగారు పడుతున్నారు.

చిరుతలు అధికంగా ఉండే నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి వీటిని తీసుకు వచ్చి, కునో పార్కులో వదిలిన సంగతి తెలిసిందే. కునో చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో ఒబాన్ యథేచ్ఛగా తిరుతున్నది. తాజాగా ఆశా కూడా బయటకు వెళ్లిపోయినట్టు అధికారులు గుర్తించారు. తూర్పు దిశగా శివపురి జిల్లా వైపు ఆశా కదులుతున్నట్టు అధికారులు గమనించారు. కునో వెలుపలి అటవీ ప్రాంతంలో ఆశా ఉన్నట్టు గుర్తించామని ఫారెస్టు అధికారి ఒకరు తెలిపారు.

షియోపూర్ జిల్లాలోని వ్యవసాయ భూములు వాటికి తమ పూర్వ నివాస స్థలమైన నమీబియాలోని సవన్నా అటవీ ప్రాంతాన్ని గుర్తుకు తెచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఈ రెండు చిరుతలు ఒకదానికి ఒకటి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకో చిరుత పార్క్ నుంచి బయటకు పోకుండా జాగ్రత్త పడుతున్నారు.