చిరు VS సుమన్‌: మూడు దశాబ్దాల వివాదం.. ముగిసినట్టేనా!

విధాత‌, సినిమా: నటుడు హీరో సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేదు. తెలుగు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లో భాషల్లో ఎన్నో చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. 1982 నుంచి 1998 వరకు స్టార్‌డ‌మ్ చూశారు. నేటి భారతం, బావ బావమరిది, సితార, అన్నమయ్య, పెద్దింటి అల్లుడు, కొండపల్లి రాజా, దేవుళ్ళు, న్యాయమే చెప్పాలి లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడిగా […]

చిరు VS సుమన్‌: మూడు దశాబ్దాల వివాదం.. ముగిసినట్టేనా!

విధాత‌, సినిమా: నటుడు హీరో సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేదు. తెలుగు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లో భాషల్లో ఎన్నో చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. 1982 నుంచి 1998 వరకు స్టార్‌డ‌మ్ చూశారు. నేటి భారతం, బావ బావమరిది, సితార, అన్నమయ్య, పెద్దింటి అల్లుడు, కొండపల్లి రాజా, దేవుళ్ళు, న్యాయమే చెప్పాలి లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడిగా 45 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నాడు సుమన్. ఈ సందర్భంగా సుమన్‌ని అభినందిస్తూ చిరంజీవి ఓ వీడియో సందేశం పంపించారు. అందులో సుమన్ గురించి ఎంతో ప్రేమగా వారి మధ్య అనుబంధం బోధ పడేలా మాట్లాడారు చిరంజీవి.

సుమన్ గురించి చిరంజీవి మాట్లాడుతూ మై డియర్ సుమన్ మీరు ఫిలిం ఇండస్ట్రీలో 45 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దాదాపు పది భాషల్లో 150కి పైగా చిత్రాలలో నటించారు. ఇది అద్భుతమైన విషయం. ఇది ఖచ్చితంగా మీ కమిట్మెంట్ మరియు డెడికేషన్‌కు నిదర్శనం.

ఇంత గొప్ప అచీవ్‌మెంట్ సాధించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఇలాగే మరెన్నో ఏళ్ళు ఇండస్ట్రీలో ఎంటర్టైన్ చేయాలని విష్ చేస్తున్నాను. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్.. అంటూ మెగాస్టార్ చిరంజీవి విష్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఈ టాపిక్ ఇంతగా ట్రెండ్ కావడానికి కారణం గతంలో చిరు సుమన్ల గురించి నెగటివ్ వార్త‌లు స్ప్రెడ్ కావ‌డ‌మే. వీరిద్ద‌రికి ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ద‌ని.. సుమ‌న్, చిరంజీవిల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయ‌నే వార్త‌లు రావ‌డ‌మే కార‌ణం.

సుమన్ బ్లూ ఫిలిం కేసులో చిరంజీవి హస్తముందని పలు పాత గొడవలు సినిమాల మధ్య క్లాష్‌లు, బేదాభిప్రాయాలు మనస్పర్ధలు ఇలా ఎన్నో పుకార్లు సృష్టించి నానా రచ్చ చేశారు. వాళ్లందరికీ ఒకే ఒక వీడియోతో చిరు సమాధానమిచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి సమయంలోనైనా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. బయట జ‌నాల‌కు హీరోలు అంత స్నేహంగా ఉంటార‌నే విషయం తెలియకపోవచ్చు. కానీ వారి మధ్య ఎలాంటి అనుబంధం ఉన్నది అనేది సమయం వస్తే గానీ తెలియదు.

అలా మెగాస్టార్ చిరంజీవికి, సుమన్‌కి మధ్య ఉన్న స్నేహం గురించి జనాలకు తెలియదు. కొన్ని నెలల పాటు వీరి మధ్య ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. కాగా తాజాగా మెగాస్టార్ చిరు స్వయంగా సుమన్‌ను వీడియో ద్వారా అభినందించడంతో అది హాట్ టాపిక్‌గా మారింది.