CM JAGAN CHANDRABABU
విధాత: దేశంలో ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా.. నేరం జరిగినా.. అవినీతి జరిగినా దాన్ని ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డికి ముడిపెట్టి మాట్లాడడం చంద్రబాబుకు అలవాటైపోయినట్లుంది. ఇదే తరహాలో ఆయన కొత్తగా చిత్రమైన కామెంట్ చేశారు. వాస్తవానికి దేశంలో వయసుతో సంబంధం లేకుండా యువకులు సైతం గుండెపోటుతో కూలబడి మరణిస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం కార్డియక్ అరెస్ట్ తో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
దీని మీద వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. ఇలా ఎందుకు అవుతోంది అని ఆరా తీస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇలా అకస్మాత్తు మరణాలకు కారణం కనుగొన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్ల గుండె పోట్లు వస్తున్నాయని అంటున్నారు. ఒత్తిడి టెన్షన్‌తో పాటు ప్రభుత్వ దమన కాండ కారణంగానే చనిపోతున్నారు అని అంటున్నారు.
నిజానికి గుండె పోట్లు అన్నవి దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. దానికి కరోనా అనంతర సమస్యలతో పాటు వ్యాక్సిన్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అన్నది కూడా స్టడీ చేస్తున్నారు. అది ఇంకా ఏమీ తేలడంలేదు. కానీ చంద్రబాబు మాత్రం వైసీపీ ప్రభుత్వం వల్లనే ఆ ప్రభుత్వం వత్తిడి చేయడం వల్లనే గుండె పోట్లు అంటున్నారు. అందుకే ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతూ కుప్పకూలి మరణించారని అంటున్నారు. తమ పార్టీ వారి మీద ప్రభుత్వం వత్తిడి ఉందని అందుకే పరుపుల రాజా లాంటి వారి మరణాలు అని చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అంతా భయంగా బతుకుతున్నారని తీవ్ర వత్తిడికి లోను అవుతున్నారని అన్నారు. అయితే చంద్రబాబు లాజిక్ మరచిపోయి ఈ తరహా ఆరోపణలు చేయడం వల్లనే ఆయన నిజంగా ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు కూడా జనాలు పెద్దగా పట్టించుకోవడంలేదు అని అంటున్నారు. మొత్తానికి జగన్ను బదనాం చేయడానికి ఏచిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు.