CM KCR | జంగల్ బచావో- జంగల్ బడావో: సీఎం కేసీఆర్

CM KCR అటవీ అమరవీరులకు ఘన నివాళి విధాత, హైదరాబాద్: అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలంటే ‘జంగల్ బచావో - జంగల్ బడావో’ నినాదాన్ని చిత్తశుద్ధితో అమలుకు ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించింది. అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు సీఎం కేసీఆర్‌ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన సందేశమిస్తూ, తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య […]

  • Publish Date - September 11, 2023 / 12:16 AM IST

CM KCR

  • అటవీ అమరవీరులకు ఘన నివాళి

విధాత, హైదరాబాద్: అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలంటే ‘జంగల్ బచావో – జంగల్ బడావో’ నినాదాన్ని చిత్తశుద్ధితో అమలుకు ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించింది.

అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు సీఎం కేసీఆర్‌ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన సందేశమిస్తూ, తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రభుత్వం కంకణబద్ధమైందని అన్నారు. ఆ దిశగా సాగిన చర్యలు ప్రస్తుత దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నామని తెలిపారు.

అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి పెద్దఎత్తున చేపట్టామన్నారు. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెంపొందించి, 2022 ఏడాదికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ దక్కించుకున్నట్లు గుర్తు చేశారు.

ఇదే స్ఫూర్తితో హరిత తెలంగాణ కోసం మన లక్షిత పచ్చదనం 33 శాతం సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పనిచేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, మనందరికీ స్ఫూర్తి దాయకంగా నిలిచారన్నారు. అమరుల ఆశయాలు సజీవంగా ఉండేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సమాజం కలసిరావాలని కోరారు.