CM KCR | కేసీఆర్ పెద్దపల్లి నుండే పోటీ చేయాలి

CM KCR కామారెడ్డి వద్దు.. పెద్దపల్లి ముద్దు నినాదంతో వెలసిన ప్లెక్సీలు.. విధాత బ్యూరో, కరీంనగర్:CM KCR పెద్దపల్లి నుండే పోటీ చేయాలని పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు బొంకురి సురేందర్ సన్నీ, అతని భార్య పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ బొంకురి భాగ్యలక్ష్మిల పేరిట జిల్లా కేంద్రంలో 'కామారెడ్డి వద్దు.. పెద్దపల్లి ముద్దు' అని ప్లెక్సీలు వెలియగా, ఈ విషయమై జిల్లా కేంద్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే […]

  • Publish Date - July 23, 2023 / 11:14 AM IST

CM KCR

  • కామారెడ్డి వద్దు.. పెద్దపల్లి ముద్దు నినాదంతో వెలసిన ప్లెక్సీలు..

విధాత బ్యూరో, కరీంనగర్:CM KCR పెద్దపల్లి నుండే పోటీ చేయాలని పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు బొంకురి సురేందర్ సన్నీ, అతని భార్య పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ బొంకురి భాగ్యలక్ష్మిల పేరిట జిల్లా కేంద్రంలో ‘కామారెడ్డి వద్దు.. పెద్దపల్లి ముద్దు’ అని ప్లెక్సీలు వెలియగా, ఈ విషయమై జిల్లా కేంద్రంలో జోరుగా చర్చ జరుగుతోంది.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆరెస్‌ అధినేత, CM KCR గజ్వేల్ తో పాటు కామారెడ్డి, పెద్దపల్లి నియోజకవర్గాాలలో ఏదేని మరొక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాాల్లో కొంతకాలంగా చర్చ సాగుతుంది. తన పోటీ ద్వారా పరిసర నియోజకవర్గాలలో ప్రభావం చూపే లక్ష్యంతో కేసీఆర్ వ్యూహా రచనలో ఉన్నారన్న ప్రచారం వినిపిస్తుంది. కామారెడ్డి కాదనుకుంటే పెద్దపల్లి నుంచే KCR పోటీ చేసే అవకాశాలున్నాయని బీఆరెస్‌ కేడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వారం రోజుల నుంచి సర్వే బృందాలు పెద్దపల్లి నియోజకవర్గ పార్టీ వర్గాలకు తెలియకుండా సర్వే చేస్తున్నట్లు సమాచారం. బీఆరెస్‌ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులు నాలుగుసార్లు పోటీ చేసి మూడుసార్లు విజయం సాధించారు. BRSకు ఆయువు పట్టుగా ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గతంతో పోలిస్తే పార్టీ బలహీన పడుతున్నట్లుగా సర్వేలో తేలుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని అధిగమించి పట్టు సడలకుండా ఉండేందుకు KCR ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సాధించినట్టు తెలుస్తోంది. అందుకే గజ్వేల్ ను వదిలి, పెద్దపల్లి నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2011, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్ రెడ్డి BRS తరపున గెలుపొందారు. ప్రస్తుతం పెద్దపల్లి నుండి KCR పోటీ చేస్తారన్న ప్రచారంతో దాసరి మనోహర్ రెడ్డి భవితవ్యం ఏమిటో తెలియడం లేదని ఆయన మద్దతుదారులు అయోమయంలో పడిపోయారు.