సివిల్స్ టాపర్ అనన్యరెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
తాజాగా వెలువడిన సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటి మూడో ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ డి. అనన్య రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.
విధాత, హైదరాబాద్ : తాజాగా వెలువడిన సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటి మూడో ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ డి. అనన్య రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. అనన్యరెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులను రేవంత్‌రెడ్డి సన్మానించారు. అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలో సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. ఆమె ప్రతిభా రాష్ట్రానికి గర్వకారణమన్నారు. జీవితంలో ఆమె మరిన్ని ఉన్నత స్థానాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram