బాక్సర్ నిఖత్ జరీన్‌ 2కోట్ల సాయం

బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం 2కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించింది. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత ఆర్ధిక సహాయం చెక్కును జరీన్‌కు అందచేశారు

  • By: Somu    latest    Dec 09, 2023 10:45 AM IST
బాక్సర్ నిఖత్ జరీన్‌ 2కోట్ల సాయం
  • చెక్కు అందించిన సీఎం రేవంత్‌రెడ్డి


విధాత : బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం 2కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించింది. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత ఆర్ధిక సహాయం చెక్కును జరీన్‌కు అందచేశారు. పారిస్ ఒలింపిక్స్​లో శిక్షణ కోసం ఈ మొత్తం ఆమెకు అందించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని రేవంత్ రెడ్డి ఆకాక్షించారు.


ఇటీవలే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్‌ బంగారు పతకం సాధించారు. ఇటీవల నిర్వహించిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌ 50 కిలోల విభాగంలో ఆమె స్వర్ణ పతకం సాధించారు. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. ప్రముఖ బాక్సర్ మేరికోమ్‌ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్ గా రికార్డ్ సృష్టించారు.