షాకింగ్: తాగుబోతును కాటేస్తే.. నాగుపామే చనిపోయింది
విధాత: నాగుపాము.. ఆ పేరు వింటేనే భయమేస్తోంది. మరి ఆ పామును చూస్తే పరుగులు పెట్టాల్సిందే.. శరరీమంతా చెమటలు పట్టాల్సిందే. అంతటి విషపూరితమైన సర్పం అది. ఇక ఆ కింగ్ కోబ్రా కాటేస్తే.. క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ అందుకు విరుద్ధంగా ఓ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కాటేస్తే.. పామే చనిపోయింది. ఇది వినడానికి, చదవడానికి ఆశ్చర్యంగా ఉంది కదా..? కానీ ఇది నిజమే. View this post on Instagram A […]

విధాత: నాగుపాము.. ఆ పేరు వింటేనే భయమేస్తోంది. మరి ఆ పామును చూస్తే పరుగులు పెట్టాల్సిందే.. శరరీమంతా చెమటలు పట్టాల్సిందే. అంతటి విషపూరితమైన సర్పం అది. ఇక ఆ కింగ్ కోబ్రా కాటేస్తే.. క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
కానీ అందుకు విరుద్ధంగా ఓ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కాటేస్తే.. పామే చనిపోయింది. ఇది వినడానికి, చదవడానికి ఆశ్చర్యంగా ఉంది కదా..? కానీ ఇది నిజమే.
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పీకల దాకా మద్యం సేవించాడు. ఆ సమయంలో నాగు పాము అతన్ని కాటేసింది. కానీ అతను చనిపోలేదు. పామే చనిపోయింది. ఇక అతను ఆస్పత్రికి వెళ్లే ముందు.. ఆ పామును ఓ కవర్‌లో వేసుకుని వెళ్లాడు.
అక్కడ వైద్యులు చూసి షాకయ్యారు. బాధితుడికి ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.