ముంబైలో రూ. 9.8 కోట్ల విలువ చేసే కొకైన్ సీజ్
ముంబై : ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. సోమవారం కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌లో అడిస్ అబబా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కొకైన్‌ను గుర్తించారు. ఆ ప్రయాణికుడి వద్ద 980 గ్రాముల కొకైన్ పట్టుబడిందని అధికారులు తెలిపారు. దాని విలువ రూ. 9.8 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. లోదుస్తుల్లో దాచి కొకైన్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.