Kharge | మత హింస సహించరానిది: మల్లికార్జున ఖర్గే

Kharge | లేదంటే భావి తరాలకు నష్టం న్యూఢిల్లీ : 21వ శతాబ్దంలో కూడా మతం పేరిట హింస సాగటాన్ని సహించరాని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కాకపోతే మన భావితరాలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని మంగళవారం ఆయన హెచ్చరించారు. ‘హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లోగానీ, ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేసిన పనిగానీ భారత మాత హృదయాన్ని తీవ్రంగా గాయపర్చాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు బలహీనమైన శాంతిభద్రతల […]

  • Publish Date - August 1, 2023 / 12:20 AM IST

Kharge |

లేదంటే భావి తరాలకు నష్టం

న్యూఢిల్లీ : 21వ శతాబ్దంలో కూడా మతం పేరిట హింస సాగటాన్ని సహించరాని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కాకపోతే మన భావితరాలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని మంగళవారం ఆయన హెచ్చరించారు.

‘హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లోగానీ, ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేసిన పనిగానీ భారత మాత హృదయాన్ని తీవ్రంగా గాయపర్చాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు బలహీనమైన శాంతిభద్రతల పరిస్థితి మీద, బలహీనమైన రాజ్యాంగ సంస్థల మీద తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని చెప్పారు.

శాంతిని పునరుద్ధరించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ‘21వ శాతాబ్దంలో మతం పేరిట హింసకు పాల్పడటం మన నాగరికత, అన్ని మతాల సమాతన్వం పునాదులకు తీవ్ర విఘాతం’ అని ఆయన అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిని సహించరాదని చెప్పారు. ‘విద్వేషాన్ని వదిలి పెట్టండి.. భారతదేశాన్ని ఐక్యం చేయండి’ అని ఆయన ట్వీట్‌ చేశారు.