పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్తుండగా కారులో మంటలు.. గర్భిణి సజీవదహనం
Kerala | నెలలు నిండిన ఓ గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ కారులో ఆస్పత్రికి బయల్దేరింది. మార్గమధ్యలోనే కారులో మంటలు చెలరేగడంతో.. గర్భిణితో పాటు ఆమె భర్త సజీవదహనం అయ్యారు. ఈ విషాదకర ఘటన కేరళలోని కన్నూరు జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్నూరు జిల్లాకు చెందిన రీషా(26) అనే మహిళ గర్భిణి. ఆమెకు నెలలు ఉండటంతో.. గురువారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో భర్త ప్రిజిత్.. రీషా, కుటుంబ సభ్యులతో కలిసి […]

Kerala | నెలలు నిండిన ఓ గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ కారులో ఆస్పత్రికి బయల్దేరింది. మార్గమధ్యలోనే కారులో మంటలు చెలరేగడంతో.. గర్భిణితో పాటు ఆమె భర్త సజీవదహనం అయ్యారు. ఈ విషాదకర ఘటన కేరళలోని కన్నూరు జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కన్నూరు జిల్లాకు చెందిన రీషా(26) అనే మహిళ గర్భిణి. ఆమెకు నెలలు ఉండటంతో.. గురువారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో భర్త ప్రిజిత్.. రీషా, కుటుంబ సభ్యులతో కలిసి కారులో జిల్లా ఆస్పత్రికి బయల్దేరాడు. ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలోనే రీషా ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రీషా, ప్రిజిత్ మంటల్లో కాలిపోయారు.
వెనుక సీట్లో కూర్చొన్న చిన్నారి సహా నలుగురు వ్యక్తులు అప్రమత్తమై డోర్లు తీసి బయటకు దూకేశారు. దీంతో వారు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ముందు సీట్లో కూర్చున్న గర్భిణి, ఆమె భర్తను అగ్నికీలల నుంచి కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ డోర్లకు మంటలు వ్యాపించడంతో స్థానికుల చేసిన ప్రయత్నం విఫలమైంది. రీషా, ప్రిజిత్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.