CPI | వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ నేతల పర్యటన

CPI న్యూఢిల్లీ: ఢిల్లీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర సీపీఐ ప్రతినిధి బృందం పర్యటించింది. వరదతో తీవ్రంగా ప్రభావితమైన ఒకటవ పుష్ట, 5వ పుష్ట సమీప ప్రాంతాల బాధితులను వజీరాబాద్‌ సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌ వద్ద కలుసుకున్న సీపీఐ నేతలు.. వారి గోడు తెలుసుకున్నారు. ఈ ప్రతినిధి బృందానికి సీపీఐ జాతీయ కార్యదర్శులు కే నారాయణ, రామకృష్ణ పాండా, సీపీఐ ఢిల్లీ సమితి కార్యదర్శి ప్రొఫెసర్‌ దినేశ్‌ వర్షనే, ఏఐకేఎస్‌ అధ్యక్షుడు ఆర్‌ వెంకయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన […]

CPI | వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ నేతల పర్యటన

CPI

న్యూఢిల్లీ: ఢిల్లీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర సీపీఐ ప్రతినిధి బృందం పర్యటించింది. వరదతో తీవ్రంగా ప్రభావితమైన ఒకటవ పుష్ట, 5వ పుష్ట సమీప ప్రాంతాల బాధితులను వజీరాబాద్‌ సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌ వద్ద కలుసుకున్న సీపీఐ నేతలు.. వారి గోడు తెలుసుకున్నారు. ఈ ప్రతినిధి బృందానికి సీపీఐ జాతీయ కార్యదర్శులు కే నారాయణ, రామకృష్ణ పాండా, సీపీఐ ఢిల్లీ సమితి కార్యదర్శి ప్రొఫెసర్‌ దినేశ్‌ వర్షనే, ఏఐకేఎస్‌ అధ్యక్షుడు ఆర్‌ వెంకయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి విక్కీ మహేశియారీ తదితరులు నాయకత్వం వహించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని కాలనీల్లో ఇంకా నీరు, మట్టి అలా పేరుకునే ఉన్నాయి. జెట్‌పూర్‌ ఏరియాలో ఇంకా ఐదు అడుగుల ఎత్తున నీరు నిలిచే ఉన్నది. యమునా బజార్‌ ఏరియా జలదిగ్బంధంలోనే ఉన్నది. ఉన్నవన్నీ కొట్టుకుపోయాయని, కట్టుబట్టలతో మిగిలామని బాధితులు సీపీఐ ప్రతినిధి బృందం ఎదుట వాపోయారు.

బాధితులకు వైద్య సహాయం కూడా అందటం లేదు. పదివేల సాయం ఏమూలకూ సరిపోదని, మానవత్వంతో ఆలోచించి ప్రభావిత ప్రజలను ఆదుకోవాలని సీపీఐ నేతలు ఢిల్లీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీళ్లు నిలిచిపోయిన ప్రాంతాల్లో సత్వరమే పంపింగ్‌ చేసి, నీళ్లు తొలగించాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. దీనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరింది. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించాలని కోరింది.