CPI NARAYANA | నారాయణ అంతమాట అనేశారు.. బాబు బ్యాచ్ గాలి తీసేసినట్టేనా

CPI NARAYANA | విధాత: సీనియర్ నాయకుడు..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఒక్కోసారి తిరకాసుగా మాట్లాడుతుంటారు కానీ అదే సమయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడతారు. తను మొదటి నుంచి టిడిపికి అనుకూలంగా ఉంటూ వస్తారు. అపుడపుడు కాంగ్రెస్ తోను. ఒక్కోసారి టిడిపితో కూడా పొత్తులు పెట్టుకుంటూ కాలం గడుపుతూ వస్తున్న సీపీఐ గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో ఉనికిని కోల్పోతూ వస్తోంది. అయినా సరే నారాయణ మాత్రం ఒక పిసర మొగ్గు టిడిపి వైపే ఉంటారు. కానీ […]

  • Publish Date - May 23, 2023 / 03:02 AM IST

CPI NARAYANA |

విధాత: సీనియర్ నాయకుడు..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఒక్కోసారి తిరకాసుగా మాట్లాడుతుంటారు కానీ అదే సమయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడతారు. తను మొదటి నుంచి టిడిపికి అనుకూలంగా ఉంటూ వస్తారు.

అపుడపుడు కాంగ్రెస్ తోను. ఒక్కోసారి టిడిపితో కూడా పొత్తులు పెట్టుకుంటూ కాలం గడుపుతూ వస్తున్న సీపీఐ గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో ఉనికిని కోల్పోతూ వస్తోంది. అయినా సరే నారాయణ మాత్రం ఒక పిసర మొగ్గు టిడిపి వైపే ఉంటారు. కానీ తాజాగా ఆయన జగన్ కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు.

సీపీఐ నేత నారాయణ తాజాగా మాట్లాడుతూ ఏపీలో తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తులు పెట్టుకుంటాయని చెబుతూ అలా ఎన్నికలకు వెలితే ఖచ్చితంగా జగన్ గెలుస్తారని తేల్చి పారేశారు.
బీజేపీకి దేశవ్యాప్తంగా గట్టి వ్యతిరేకత ఉందని. పైగా ఆ పార్టీ ఏపీకి ఏమీ చేయ లేదని అంటున్నారు.

బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే అది వైసీపీకి ప్రయోజనం కలిగిస్తుందని, ముస్లిం మైనారిటీలు ఇతర వర్గాల ఓట్లు అన్నీ వైసీపీకే పడతాయని, జగన్ ఖచ్చితంగా గెలుస్తారని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపిని సైతం పొత్తులోకి తీసుకొచ్చి ముగ్గురూ కలిసి పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి పవన్ ఒకే అంటున్నా బీజీపీ మాత్రం నో అంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో బిజెపి ఓటమి ఏపి. తెలంగాణాలోని బిజెపి శాఖల మీద కూడా ఉంటుంది. అక్కడ బండి సంజయ్ జోరు కూడా కాస్త తగ్గింది . రేవంత్ రెడ్డి హుషారు అందుకున్నాడు. ఇక ఏపిలో సైతం బిజెపి పట్ల గట్టి వ్యతిరేకత ఉంటుంది.

దాంతో పొత్తు పెట్టుకుంటే టిడిపికి సైతం ఓటమి తప్పదు అని నారాయణ లెక్కేసి చెబుతున్నారు. మరి చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో . కర్ణాటక ఫలితాలు తరువాత బిజెపి విషయంలో ఆయన అభిప్రాయం మారిందో లేదో చూడాలి .