HANUMAKONDA | దాస్యం VS నాయిని: చీఫ్‌ విప్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. CPకి BRS ఫిర్యాదు

తీవ్రంగా పెరిగిన రాజకీయ వైషమ్యాలు ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీ విమ‌ర్శ‌లు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మధ్య రాజకీయ వైశ్యామ్యాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు కరపత్రాలు, పోస్టర్లు పరస్పర రాజకీయ విమర్శలకు పరిమితమైన స్థితి దాటి పోలీసులకు ఫిర్యాదు చేసుకునే దశకు చేరుకుంది. నాయినిపై సీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు […]

HANUMAKONDA | దాస్యం VS నాయిని: చీఫ్‌ విప్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. CPకి BRS ఫిర్యాదు
  • తీవ్రంగా పెరిగిన రాజకీయ వైషమ్యాలు
  • ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీ విమ‌ర్శ‌లు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మధ్య రాజకీయ వైశ్యామ్యాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు కరపత్రాలు, పోస్టర్లు పరస్పర రాజకీయ విమర్శలకు పరిమితమైన స్థితి దాటి పోలీసులకు ఫిర్యాదు చేసుకునే దశకు చేరుకుంది.

నాయినిపై సీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసన సభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్‌కు హనుమకొండ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో కార్పోరేటర్లు మాట్లాడుతూ దాస్యం వినయ్ భాస్కర్ పై ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చ‌రించారు.

నాయిని రాజేందర్ రెడ్డి అక్రమాలను, చట్ట వ్యతిరేక పేకాట బాగోతాలను, కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లలో చేసిన అక్రమాలను, వసూళ్లను ప్రజలకు తెలిపే విధంగా చేస్తాం అని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అదేవిధంగా చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ను కోరారు.

సిపి స్పందన పై ఆసక్తి

తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ప్రచారం కలిగిస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో టి బి ఆర్ ఎస్ నాయకులు ఆరోపించారు.
టిఆర్ఎస్ నాయకులు చేసిన ఈ ఫిర్యాదు పై సిపి ఏ విధంగా స్పందిస్తాడోననే చర్చ జరుగుతుండగా నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిస్పందన ఏవిధంగా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.

దాస్యం వర్సెస్ నాయిని

ఇప్పటికే దాస్యం వినయ్, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలున్న విషయం అందరికీ తెలిసిందే. పరస్పరం విరుద్ధ రాజకీయ పార్టీలకు చెందిన ఈ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా అభిప్రాయ భేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, రాజకీయ విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఈ విమర్శల దాడి పరిధి దాటి సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఎన్ ఎస్ యు ఐ నాయకుడు తోట పవన్ పై జరిగిన దాడి నేపథ్యంలో పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఆ వేడి ఇంకా తగ్గక ముందే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు కార్పొరేటర్లు మరో అడుగు ముందుకు వేశారు.

ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీ

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇరువురు నాయకులు ఒకరికొకరు పోటీ పడే అవకాశం ఉన్నందున ఎవరికి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతగా ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ పై భూకబ్జా, అవినీతి ఆరోపణలను నాయి చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రలో భాగంగా ఈ విషయాలపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిగా కాంగ్రెస్ హయాంలో భూకబ్జాలకు పాల్పడింది నాయిని రాజేందర్ రెడ్డి అని, అలాగే ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో ఆయన పాత్రధారి అని విమర్శిస్తున్నారు. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరోపణలు ఏం మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి.