త‌ల్లికి పెళ్లి చేసి.. ఆనంద భాష్పాలు రాల్చిన కూతురు

Heartwarming story | ఇది ఒక హార్ట్ ట‌చింగ్ స్టోరీ. ఎందుకంటే.. పెళ్లి అయిన మూడేండ్ల‌కే భ‌ర్త‌ను కోల్పోయింది. రెండేండ్ల ప‌సిబిడ్డ ఆల‌నాపాల‌నా చూసుకుంటూ, ఆ బిడ్డ‌నే జీవితం అనుకొని ఆమె ముందుకు సాగింది. కానీ భ‌ర్త దూర‌మ‌య్యాడ‌న్న బాధ ఆమెను వెంటాడుతూనే ఉంది. త‌ల్లి బాధ‌ను అర్థం చేసుకున్న కూతురు.. ఆమెకు మ‌ళ్లీ వివాహం చేసింది. భ‌ర్త లేడ‌న్న బాధ నుంచి దూరం చేసింది కూతురు. తొమ్మిది నెల‌ల క్రితం త‌ల్లికి కూతురు వివాహం చేసింది. […]

  • Publish Date - December 14, 2022 / 05:33 AM IST

Heartwarming story | ఇది ఒక హార్ట్ ట‌చింగ్ స్టోరీ. ఎందుకంటే.. పెళ్లి అయిన మూడేండ్ల‌కే భ‌ర్త‌ను కోల్పోయింది. రెండేండ్ల ప‌సిబిడ్డ ఆల‌నాపాల‌నా చూసుకుంటూ, ఆ బిడ్డ‌నే జీవితం అనుకొని ఆమె ముందుకు సాగింది. కానీ భ‌ర్త దూర‌మ‌య్యాడ‌న్న బాధ ఆమెను వెంటాడుతూనే ఉంది. త‌ల్లి బాధ‌ను అర్థం చేసుకున్న కూతురు.. ఆమెకు మ‌ళ్లీ వివాహం చేసింది. భ‌ర్త లేడ‌న్న బాధ నుంచి దూరం చేసింది కూతురు. తొమ్మిది నెల‌ల క్రితం త‌ల్లికి కూతురు వివాహం చేసింది.

హ్యుమ‌న్స్ ఆఫ్ బాంబే ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసిన క‌థ‌నం ప్ర‌కారం.. గతేడాది ఒక సాయంత్రం మా అత్త నుంచి కాల్ వ‌చ్చింది. ఇక్క‌డ మీ అమ్మ‌ను ఇష్ట‌పడే వ్య‌క్తి దొరికాడు. వెంట‌నే నేను సంతోషం వ్య‌క్తం చేశాను. అమ్మ మ‌ళ్లీ త‌న ప్రేమ‌ను దొరికించుకుంద‌ని సంతోష‌ప‌డ్డాను. ఎందుకంటే అమ్మ‌కు 25 ఏండ్ల వ‌య‌సున్న‌ప్పుడు నాన్న చ‌నిపోయాడు. అప్పుడు నా వ‌య‌సు రెండేండ్లు. నాన్న చ‌నిపోయిన త‌ర్వాత న‌న్ను తీసుకొని నాని వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది అమ్మ‌. అప్పుడు పెళ్లి చేసుకోమ‌ని ప్ర‌తి ఒక్క‌రూ అమ్మ‌కు చెప్పారు. కానీ అమ్మ తిర‌స్క‌రించింది. నాకు ప్రేమ దొరుకుతుందేమో.. కానీ నా బిడ్డ‌కు మాత్రం నాన్న దొర‌క‌డు అని అమ్మ చెప్పింది.

అమ్మ జీవిత‌మంతా నా కోసం త్యాగం చేసింది. టీచ‌ర్‌గా ప‌ని చేస్తూ న‌న్ను పెంచి పెద్ద చేసింది. ఇక నేను స్థిర‌ప‌డ్డాను. అమ్మ‌ను సంతోషంగా చూసుకోవాల‌న్న‌దే నా ల‌క్ష్యం. ఇక అత్త కాల్ చేసి చెప్పిన విష‌యం గుర్తొచ్చింది. కొన్ని నెల‌ల త‌ర్వాత అమ్మ వ‌ద్ద‌కు వెళ్లాను. ఓ మ్యూజిక్ యాప్‌లో చేరాన‌ని అమ్మ చెప్పింది. అదే యాప్‌లో స్వాప‌న్ అనే వ్య‌క్తి అమ్మ‌కు ప‌రిచ‌యం అయ్యాడు. అమ్మ గొంతుకు అత‌ను పెద్ద అభిమాని. దీంతో వారిద్ద‌రూ మంచి స్నేహితులుగా మారారు. అత‌నితో మాట్లాడేందుకు అమ్మ ఇష్ట‌ప‌డుతంది. కానీ మొహ‌మాటం అడ్డొస్తుంది. నేను అమ్మ బాధ‌ను అర్థం చేసుకుని.. నీ జీవితం ఇంత‌టితో అయిపోలేదు. అత‌నికి ఒక ఛాన్స్ ఇవ్వ‌మ‌న్నాను.

ఇక గతేడాది అక్టోబ‌ర్‌లో అమ్మ మాట్లాడుతూ.. అత‌నంటే త‌న‌కు కూడా ఇష్ట‌మ‌ని చెప్పింది. నేను కాస్త న‌ర్వ‌స్‌కు గురైన‌ప్ప‌టికీ.. అత‌నితో మాట్లాడాను. అత‌ను కూడా సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇక ఇద్ద‌రు ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు గ‌మ‌నించాను. ఇరు కుటుంబాలు క‌లుసుకున్నాయి. పెళ్లికి ఏర్పాట్లు చేశాం. అమ్మ పెళ్లికి కావాల్సిన షాపింగ్ చేశాను. ఎరుపు రంగు చీర ధ‌రించిన అమ్మ‌.. నుదుట తిల‌కం పెట్టుకుంటే ఎంతో సంతోషం వేసింది. అమ్మ‌ను చూడ‌టానికి నా క‌ళ్లు స‌రిపోలేదు. సంప్ర‌దాయం ప్ర‌కారం అమ్మ‌, స్వాపాన్ వివాహం జ‌రిపించాం.

అమ్మ‌కు వివాహం జ‌రిగి 9 నెల‌లు కావొస్తుంది. నేను ఫోన్ చేసిన‌ప్పుడ‌ల్లా అమ్మ గొంతులో సంతోషం విన‌ప‌డుతుంది. ఆ సంతోషాన్ని చూస్తుంటే నాకు గొప్పగా అనిపిస్తోంది అని కూతురు దేబ్ అర్తి రియా చ‌క్ర‌వ‌ర్తి పేర్కొంది.