కూతురిపై క‌న్నేశాడు.. భార్య‌కు నిద్ర మాత్ర‌లు ఇచ్చి..

Hyderabad | కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన కూతురిపైనే ఓ తండ్రి కన్నేశాడు. ఆమె ప‌ట్ల రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించాడు. గ‌త రెండేండ్ల నుంచి కూతురిపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఈ దారుణ ఘ‌ట‌న కుషాయిగూడ ప‌రిధిలోని కాప్రాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది న‌వంబ‌ర్ 27వ తేదీన కాప్రా జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో షీ టీమ్స్ పోలీసులు.. గుడ్ ట‌చ్, బ్యాడ్ ట‌చ్, ఈవ్‌టీజింగ్‌, హ్యుమ‌న్ ట్రాఫికింగ్ వంటి అంశాల‌పై విద్యార్థినుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. […]

కూతురిపై క‌న్నేశాడు.. భార్య‌కు నిద్ర మాత్ర‌లు ఇచ్చి..

Hyderabad | కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన కూతురిపైనే ఓ తండ్రి కన్నేశాడు. ఆమె ప‌ట్ల రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించాడు. గ‌త రెండేండ్ల నుంచి కూతురిపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఈ దారుణ ఘ‌ట‌న కుషాయిగూడ ప‌రిధిలోని కాప్రాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది న‌వంబ‌ర్ 27వ తేదీన కాప్రా జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో షీ టీమ్స్ పోలీసులు.. గుడ్ ట‌చ్, బ్యాడ్ ట‌చ్, ఈవ్‌టీజింగ్‌, హ్యుమ‌న్ ట్రాఫికింగ్ వంటి అంశాల‌పై విద్యార్థినుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. దీంతో అక్క‌డున్న చాలా మంది అమ్మాయిల‌కు ధైర్యం వ‌చ్చింది. త‌మ‌కు జ‌రుగుతున్న అవ‌మానాల‌పై అమ్మాయిలు నోరు విప్పారు.

అయితే 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ అమ్మాయి.. త‌న తండ్రి చేస్తున్న అరాచ‌కాల‌ను షీ టీమ్స్ పోలీసుల‌కు చెప్పింది. అమ్మ అనారోగ్యానికి గురైంది. నిద్ర స‌రిగా పోదు. దీంతో ఆమెకు నిద్ర మాత్ర‌లు ఇచ్చేవాడు. అమ్మ నిద్ర‌లోకి జారుకున్న త‌ర్వాత నాన్న నన్ను లైంగిక వేధింపుల‌కు గురి చేసేవాడు. గ‌త రెండేండ్ల నుంచి త‌న‌పై అత్యాచారం చేస్తున్నాడ‌ని బాధిత విద్యార్థిని పోలీసుల‌కు తెలిపింది. దీంతో బాధితురాలి తండ్రి ప్ర‌శాంత్‌ను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు.