Delhi liquor policy case । లిక్కర్‌ కేసులో జైలుకు మనీశ్‌ సిసోడియా

Manish Sisodia Sent To Jail । లిక్కర్‌ కేసులో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party (AAP)) సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సోమవారం తీహార్‌లోని ఒకటవ నంబరు జైలుకు తరలించారు. అంతకు ముందు ఈ కేసులో సిసోడియాకు మార్చి 20 వరకు స్పెషల్‌ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. విధాత : లిక్కర్‌ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi […]

  • Publish Date - March 6, 2023 / 11:49 AM IST

Manish Sisodia Sent To Jail । లిక్కర్‌ కేసులో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party (AAP)) సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సోమవారం తీహార్‌లోని ఒకటవ నంబరు జైలుకు తరలించారు. అంతకు ముందు ఈ కేసులో సిసోడియాకు మార్చి 20 వరకు స్పెషల్‌ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.

విధాత : లిక్కర్‌ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party (AAP)) సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియాకు ఈ నెల 20 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను తీహార్‌లోని ఒకటవ నంబరు జైలు(Tihar Jail No 1)కు తరలించారు.

సీబీఐ (CBI) కస్టడీ ముగిసిన సిసోడియాను సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. మరిన్ని రోజుల కస్టడీని కోరని సీబీఐ.. భవిష్యత్తులో అవసరమైతే కస్టడీకి అడుతామని తెలుపడంతో ఆయనకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ జ్యుడిషియల్‌ కస్టడీ విధించారు.

వైద్య పరీక్షల సందర్భంగా డాక్టర్లు సూచించిన మందులను వెంట ఉంచుకునేందుకు ఆప్‌ నేతకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీనితోపాటు తన వెంట కళ్లజోడు, డైరీ, పెన్‌, భగవద్గీత పుస్తకం ఉంచుకునేందుకు కోర్టు అంగీకరించింది. సిసోడియా తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు ఆయనను మెడిటేషన్‌ సెల్‌లో ఉంచాలని జైలు అధికారులకు న్యాయమూర్తి నిర్దేశించారు.

ఆప్‌లో కేజ్రీవాల్‌ తర్వాత నంబర్‌ టూ నేతగా భావించే సిసోడియా.. బెయిల్‌ (bail) కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ జరుపనున్నది. ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయిన మనీశ్‌ సిసోడియాను తొలుత ఐదురోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. తదుపరి మరో రెండు రోజులపాటు కస్టడీని పొడిగించింది. మరికొంతకాలం ఆయన కస్టడీని కోరే అవకాశం లేదని విచారణకు ముందే సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

తనను అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని మనీశ్‌ సిసోడియా తన బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది తనకు మానసికంగా ఇబ్బంది కలిగిస్తున్నదని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రికవరీలు జరిగినందుకు ఆయనను కస్టడీలో ఉంచితే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిసోడియా తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

దర్యాప్తు జరపడంలో సీబీఐ చేతకానితనం రిమాండ్‌కు మూలం కారాదని ఆయన వాదించారు. అయితే.. సిసోడియా దర్యాప్తునకు సహకరించడం లేదని ప్రశ్నలకు సమాధానాలు దాట వేస్తున్నారని మరోవైపు సీబీఐ వాదించింది. సిసోడియా వైద్య పరీక్షలు, ఆయన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) విచారించడం వల్ల కూడా సమయం వృథా అయ్యిందని తెలిపింది.

తన అరెస్టు నేపథ్యంలో సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. తనను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) పదవితోపాటు 18 పోర్టుఫోలియోలకు ఆయన రాజీనామా చేశారు.