Delhi Liquor Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నేడు ఈడీ విచారణకు కల్వకుంట్ల కవిత.. అరెస్టు చేస్తారా?

Delhi Liquor Case | ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవనున్నారు. విచారణ అనంతరం కవితను అరెస్టు చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శుక్రవారం జరిగిన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అరెస్టు చేస్తారనే వార్తలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. దర్యాప్తు సంస్థలతో కేంద్రం బీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేస్తోందని, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో […]

Delhi Liquor Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నేడు ఈడీ విచారణకు కల్వకుంట్ల కవిత.. అరెస్టు చేస్తారా?

Delhi Liquor Case | ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవనున్నారు. విచారణ అనంతరం కవితను అరెస్టు చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శుక్రవారం జరిగిన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అరెస్టు చేస్తారనే వార్తలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. దర్యాప్తు సంస్థలతో కేంద్రం బీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేస్తోందని, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసే అవకాశం ఉందని నేతలతో చెప్పినట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నేతలను క్రమ పద్ధతిలో టార్గెట్‌ చేస్తోందని, పార్టీ మంత్రులు, ఎంపీలతో ప్రారంభమై తాజాగా తన కూతురినే దర్యాప్తు సంస్థలు టార్గెట్‌ చేస్తున్నాయని, ఇది మన మనోధైర్యాన్ని తగ్గించబోవని, కేంద్రంలోని బీజేపీ(bjp)Delhi Liquor Caseప్రభుత్వాన్ని సాగనంపే వరకు పోరాటం కొనసాగించాలని నేతలకు పిలుపునిచ్చారు.

అరుణ్‌ పిళ్లై.. కవిత ముఖాముఖిగా విచారణ..?

ఎక్సైజ్‌ పాలనీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ విచారణకు కవిత హాజరవనున్నారు. వాస్తవానికి ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, అదే రోజు మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం ఉండడంతో సమయం కావాలని కోరారు. ఈ క్రమంలో శనివారం విచారణకు రావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మద్యం పాలసీ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు విచారణ సమయంలో కవితకు బినామీగా ఉన్నట్లు అరుణ్‌ పిళ్లై ఒప్పుకున్నట్లు ఈడీ తెలిపింది. మరో వైపు తాను కవితకు బినామీనని ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అరుణ్‌ పిళ్లై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం విశేషం. ఈ క్రమంలోనే అరుణ్‌ పిళ్లై.. కవితను ఇద్దరిని ముఖాముఖిగా విచారించాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం.

కేజ్రీవాల్‌, సిసోడియాతో కవితకు ఒప్పందం..మనీష్‌ సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు

లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా (Manish Sisodia)రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. 58 పేజీల రిపోర్ట్‌లో రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను బయటపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియాతో కవితకు రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు తన వాగ్మూలంలో చెప్పినట్లు ఈడీ పేర్కొంది. విజయ్‌నాయర్‌ను కవిత 2021 మార్చి 19, 20 తేదీల్లో కలిశారని, మద్యం విధానంలో ఎలా మార్పు చేస్తామనే విషయాలను కవితకు విజయ్‌నాయర్‌ వివరించారని బుచ్చిబాబు తెలిపినట్లు దర్యాప్తు సంస్థ రిమాండ్‌ రిపోర్టులో తెలిపింది. ఢిల్లీ సీఎం, ఉప ముఖ్యమంత్రి సిసోదియా తరఫున విజయ్‌నాయర్‌ మద్యం విధానంపై పని చేశారని స్పష్టం చేసింది. లిక్కర్‌ పాలసీలో కవితకు అనుకూలంగా మార్పులు చేస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీకి నిధులు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని చెప్పింది. మాగుంట రాఘవకు 32.5 శాతం, మేడమ్ అనగా కవితకు 32.5 శాతం, సమీర్ మహేంద్రుకు 35 శాతం ఇండో స్పిరిట్స్‌లో వాటా కుదిరిందని బుచ్చిబాబు చెప్పినట్లు పేర్కొంది. లిక్కర్‌ పాలసీని అధికారికంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే బుచ్చిబాబు చేతిలోకి వచ్చిందని చెప్పింది. మద్యం విధానంలో కొన్ని భాగాలను బుచ్చిబాబు మొబైల్‌ ఫోన్‌లో గుర్తించామని, 2021 జూన్‌లో ఐటీసీ కోహినూర్‌లో జరిగిన భేటీ తర్వాత రాజేష్‌ జోషి, సుధీర్‌లతో సమన్వయం చేసుకుని హైదరాబాద్‌ నుంచి డబ్బులు తెప్పించాలని దినేష్‌ అరోరాను విజయ్‌నాయర్‌ ఆదేశించినట్లుగా వివరించింది. సుమారు రూ.20 నుంచి రూ.30 కోట్లు హవాలా మార్గంలో అభిషేక్‌ బోయినపల్లితో సమన్వయం చేసుకుని చెప్పారని, ఆ తర్వాత 2021 సెప్టెంబర్‌లో రూ.కోటి బెంగాలీ మార్కెట్‌లోని హవాలా ఆపరేటర్‌ ద్వారా రాజేశ్‌ అందుకున్నారని చెప్పింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి మొత్తం రూ.31 కోట్లు దినేష్‌ అరోరా అందుకున్నాడు. సౌత్‌ గ్రూపు, ఆప్‌ నేతలకు మధ్య రూ.100కోట్ల ఒప్పందం కుదిరిందని అరుణ్‌ పిళ్లై 2022 నవంబర్‌ 11న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో చెప్పినట్లుగా ఈడీ పేర్కొంది. ఇదే విషయాన్ని 2023 ఫిబ్రవరి 16న ఇచ్చిన మరో స్టేట్‌మెంట్‌లో తెలిపినట్లుగా వివరించింది.