ఢిల్లీలో బ్యాడ్ వెద‌ర్‌.. 18 ఫ్లైట్ల మ‌ళ్లింపు

దేశ రాజ‌ధానిలో వాయు కాలుష్యం విమాన ప్ర‌యాణాల‌పై కూడా ప్ర‌భావం చూపుతున్న‌ది

ఢిల్లీలో బ్యాడ్ వెద‌ర్‌.. 18 ఫ్లైట్ల మ‌ళ్లింపు
  • ప్ర‌తికూల వాతావ‌ర‌ణంతో ఇత‌ర న‌గ‌రాల‌కు డైవ‌ర్ష‌న్‌
  • ఢిల్లీ విమానాశ్రయంలో పేలవమైన విజబులిటీ



విధాత‌: దేశ రాజ‌ధానిలో వాయు కాలుష్యం విమాన ప్ర‌యాణాల‌పై కూడా ప్ర‌భావం చూపుతున్న‌ది. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం 18 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్‌కు మళ్లించినట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పేలవమైన విజబులిటీ వ‌ల్ల ఉదయం 7.30 నుంచి 10.30 గంట‌ల మ‌ధ్య 18 విమానాల‌ను దారి మ‌ళ్లించిన‌ట్టు పేర్కొన్నాయి.


ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే UK954 విమానం జైపూర్‌కు దారి మ‌ళ్లించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఢిల్లీ విమానాశ్రయంలో పేలవమైన దృశ్యమానత కారణంగా ఈ సర్దుబాటు చేసిన‌ట్టు విమానాశ్ర‌య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. శ‌నివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘వెరీ పూర్‌ క్యాటగిరీలో కొనసాగుతున్న‌ది.