Priya Atlee | ఆనందానికి రూపం ఉంటే అది నువ్వే..! దర్శకుడు అట్లీ పోస్ట్‌ వైరల్‌..!

Priya Atlee | భారతీయ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో అట్లీ ఒకరు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకుడిగా తొలిచిత్రం ‘రాజారాణి’తోనే బ్లాకాబాస్టర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌తో వరుసగా తేరి, మెర్సెల్‌, బిగిల్‌ చిత్రాలతో వరుస బ్లాక్‌బాస్టర్‌ హిట్లను ఖాతాలో వేసుకొని కోలీవుడ్‌లో అగ్ర దర్శకులు సరసన నిలిచాడు. ప్రస్తుతం బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌తో ఓ యాక్షన్‌ చిత్రం […]

Priya Atlee | ఆనందానికి రూపం ఉంటే అది నువ్వే..! దర్శకుడు అట్లీ పోస్ట్‌ వైరల్‌..!

Priya Atlee | భారతీయ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో అట్లీ ఒకరు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకుడిగా తొలిచిత్రం ‘రాజారాణి’తోనే బ్లాకాబాస్టర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌తో వరుసగా తేరి, మెర్సెల్‌, బిగిల్‌ చిత్రాలతో వరుస బ్లాక్‌బాస్టర్‌ హిట్లను ఖాతాలో వేసుకొని కోలీవుడ్‌లో అగ్ర దర్శకులు సరసన నిలిచాడు.

ప్రస్తుతం బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌తో ఓ యాక్షన్‌ చిత్రం ‘జవాన్‌’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో లేడి సూపర్‌స్టార్‌ నయనతార కీలకపాత్ర పోషిస్తుండగా.. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. అట్లీ 2014లో తెలుగు అమ్మాయి నటి ప్రియను పెళ్లి చేసుకున్నాడు. గత ఎనిమిదేళ్లు సంసార జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న అట్లీ – ప్రియా జంట ఇటీవల ఎనిమిదో వివాహ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టారు.

పుట్టిన రోజు జరుపుకున్నంటున్న తన భార్య ప్రియాకు శుభాకాంక్షలు తెలుపుతూ అట్లీ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ‘జీవితం ఆనందం, ఆనందానికి రూపం ఉంటే అది నీవే’ అంటూ కామెంట్‌ జత చేయగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అట్లీ అభిమాలు ప్రియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.