Divorce | అనుకున్నదే అయ్యింది.. నిహారిక, చైతన్యలకు విడాకులు మంజూరు
Divorce విధాత: గత కొన్ని రోజులుగా కాదు కాదు.. కొంత కాలంగా నిహారిక.. ఆమె భర్త చైతన్యల మధ్య పొసగడం లేదని, ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇరు ఫ్యామిలీలకు చెందిన ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ విడాకుల మ్యాటర్‌పై ఇంత వరకు మాట్లాడలేదు.. కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. అయినా కూడా మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన ఏ వేడుకకు.. ముఖ్యంగా బావమరిది వరుణ్ […]

Divorce
విధాత: గత కొన్ని రోజులుగా కాదు కాదు.. కొంత కాలంగా నిహారిక.. ఆమె భర్త చైతన్యల మధ్య పొసగడం లేదని, ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇరు ఫ్యామిలీలకు చెందిన ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ విడాకుల మ్యాటర్‌పై ఇంత వరకు మాట్లాడలేదు.. కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. అయినా కూడా మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన ఏ వేడుకకు.. ముఖ్యంగా బావమరిది వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకలో కూడా చైతన్య కనబడకపోవడం, నిహారిక ఒక్కరే హడావుడి చేయడంతో.. దాదాపు వారిద్దరూ విడిగా ఉంటున్నారనే క్లారిటీ అయితే వచ్చేసింది.
ఇక రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రమ్‌లో చైతన్య జొన్నలగడ్డ పెట్టిన పోస్ట్‌తో.. పూర్తి స్థాయిలో సీన్ అందరికీ అర్థమైంది. తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసినట్లుగా అధికారికంగా ఓ లెటర్ బయటికి రావడంతో.. ఇన్నాళ్లు అలుముకుని ఉన్న మబ్బులన్నీ వీడాయి.
నిహారిక, చైతన్య ఎవరిదారి వారు చూసుకున్నారు. వారిద్దరూ విడాకులు తీసేసుకున్నారు. ఇక ఎవరి జీవితం వారిదే. అందుకే చైతన్య.. ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానంటూ యోగ సెంటర్ ఫొటోలు పెట్టి.. ఇన్ డైరెక్ట్‌గా విడిపోయామని తెలిపాడు. ఆయన సంతోషానికి కారణం ఈ విడాకులే అని ఇప్పుడంతా అనుకుంటుండటం విశేషం.
ఇక తాజాగా బయటికి వచ్చిన విడాకుల లేఖలో.. పరస్పర అంగీకారంతో విడిపోవాలని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. జూన్ 5వ తేదీనే వీరికి విడాకులు మంజూరు అయినట్లుగా తాజాగా వైరల్ అవుతున్న కోర్ట్ ఉత్తర్వులో ఉంది. అయితే వీరిద్దరూ పెళ్లయిన 2 సంవత్సరాలకే (అంతకంటే తక్కువే అని చెప్పుకోవచ్చు) విడిపోవడానికి కారణం ఏమై ఉంటుందా? అని అంతా డౌట్స్ రైజ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు వినిపించిన వార్తల ప్రకారం.. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో మనస్పర్థలు తలెత్తాయని, ఇద్దరూ సఖ్యతగా ఉండటం లేదని, నిహారిక ప్రవర్తన చైతన్య అండ్ ఫ్యామిలీకి నచ్చడం లేదనేలా టాక్ నడిచింది. నచ్చని చోట ఎందుకుండాలి, నచ్చేలా కృత్రిమంగా బతకడం ఇష్టం లేకే ఇద్దరూ విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు వారించినా కూడా.. కలిసుండటానికి వారు ఇష్టపడలేదని అనుకుంటున్నారు. ఇక చేసేది లేక.. పెద్దలు కూడా విడాకులకు ఓకే చెప్పారని.. ఇప్పుడు విడాకులు మంజూరు కావడంతో.. ఇరు వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా ప్రస్తుతానికైతే టాక్ వినబడుతుంది. మరి ముందు ముందు వీరిద్దరి గమ్యం ఏమిటనేది చూడాలి.
ప్రస్తుతం నిహారిక అయితే మళ్లీ నటనపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. చైతన్య పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. కాగా.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారికకు, గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు 2020 ఆగస్ట్‌లో నిశ్చితార్థం, అదే సంవత్సరం డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్‌లో వివాహం జరిగింది.