DK Aruna | అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన డీకె. అరుణ
DK Aruna | ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ వినతి విధాత : తనను హైకోర్టు గద్వాల ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఇచ్చిన ఆదేశాలను నోటిఫై చేసి పదవి ప్రమాణ స్వీకారం చేయించాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి చారిని కలిసి విన్నవించారు. గద్వాల ఎమ్మెల్యేగా అరుణను గుర్తించాలన్న హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల కాపీలను ఆమె కార్యదర్శికి సమర్పించారు. ఈ మేరకు స్పీకర్ తన ప్రమాణా స్వీకారానికి సానుకూలంగా స్పందించి ఏర్పాట్లు చేయాలని కోరారు. హైకోర్టు తీర్పు వచ్చి […]

DK Aruna |
- ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ వినతి
విధాత : తనను హైకోర్టు గద్వాల ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఇచ్చిన ఆదేశాలను నోటిఫై చేసి పదవి ప్రమాణ స్వీకారం చేయించాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి చారిని కలిసి విన్నవించారు. గద్వాల ఎమ్మెల్యేగా అరుణను గుర్తించాలన్న హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల కాపీలను ఆమె కార్యదర్శికి సమర్పించారు.
ఈ మేరకు స్పీకర్ తన ప్రమాణా స్వీకారానికి సానుకూలంగా స్పందించి ఏర్పాట్లు చేయాలని కోరారు. హైకోర్టు తీర్పు వచ్చి 15రోజులైన తనకు న్యాయం జరుగలేదన్నారు. కాగా 2018అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల అసెంబ్లీ స్థానంలో డీకే అరుణ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు.
హైకోర్టు, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనర్హత వేటు పడిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్థానంలో అరుణను డిసెంబర్ 12నుంచి ఎమ్మెల్యేగా గుర్తించాల్సివుంది. ఈ నేపధ్యంలో అరుణను ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తే సాంకేతికంగా ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగాల్సివుంటుందని భావిస్తున్నారు