బ‌స్సులో కుక్క‌కు గౌర‌వం.. ప్ర‌యాణికుల‌కు సెల్యూట్‌.. వీడియో

విధాత: బ‌స్సులోకి కుక్క ఎక్కింద‌నుకో.. మ‌నం ఏం చేస్తాం. దాన్ని బ‌స్సు నుంచి త‌రిమేస్తాం. ఒక వేళ ఆ కుక్క దిగ‌క‌పోతే దాడికి కూడా వెనుకాడం. కానీ ఈ ప్ర‌యాణికులు మాత్రం ఓ కుక్క‌ను గౌర‌వించారు. బ‌స్సులోకి ఎక్కిన కుక్క‌ను త‌రిమేయ‌లేదు. ఆ శున‌కం ఓ రెండు సీట్ల‌ను ఆక్ర‌మించుకున్న‌ప్ప‌టికీ.. దానికి ఏ మాత్రం హానీ క‌లిగించ‌లేదు. సీట్లో హాయిగా నిద్రిస్తున్న కుక్క‌కు ప్ర‌యాణికులు ఏ మాత్రం ఆటంకం క‌లిగించ‌లేదు. తోటి మ‌నిషిలా ఆ శున‌కాన్ని గౌర‌వించిన […]

బ‌స్సులో కుక్క‌కు గౌర‌వం.. ప్ర‌యాణికుల‌కు సెల్యూట్‌.. వీడియో

విధాత: బ‌స్సులోకి కుక్క ఎక్కింద‌నుకో.. మ‌నం ఏం చేస్తాం. దాన్ని బ‌స్సు నుంచి త‌రిమేస్తాం. ఒక వేళ ఆ కుక్క దిగ‌క‌పోతే దాడికి కూడా వెనుకాడం. కానీ ఈ ప్ర‌యాణికులు మాత్రం ఓ కుక్క‌ను గౌర‌వించారు. బ‌స్సులోకి ఎక్కిన కుక్క‌ను త‌రిమేయ‌లేదు.

ఆ శున‌కం ఓ రెండు సీట్ల‌ను ఆక్ర‌మించుకున్న‌ప్ప‌టికీ.. దానికి ఏ మాత్రం హానీ క‌లిగించ‌లేదు. సీట్లో హాయిగా నిద్రిస్తున్న కుక్క‌కు ప్ర‌యాణికులు ఏ మాత్రం ఆటంకం క‌లిగించ‌లేదు. తోటి మ‌నిషిలా ఆ శున‌కాన్ని గౌర‌వించిన ప్ర‌యాణికులు.. నెటిజ‌న్ల హృద‌యాల‌ను గెలుచుకున్నారు.

బ‌స్సంతా ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోయింది. నిల‌బ‌డ‌టానికి కూడా స్థ‌లం లేదు. అలాంటి బ‌స్సులో ఓ శున‌కం రెండు సీట్ల‌లో హాయిగా ప‌డుకుంది. హాయిగా నిద్రిస్తున్న ఆ కుక్క‌కు ఎలాంటి ఆటంకం క‌లిగించ‌ని ప్ర‌యాణికుల వీడియోను స్టీఫ‌నో ఎస్ మ్యాగీ అనే యూజ‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోను 50 వేల మంది వీక్షించ‌గా, 3,500 మంది లైక్ చేశారు. కుక్క‌ను గౌర‌వించిన ప్ర‌యాణికుల‌కు నెటిజ‌న్లు సెల్యూట్ చేస్తున్నారు.