గొర్రెల మందపై కుక్కల దాడి.. 35 గొర్రెలు మృతి
మూడున్నర లక్షల నష్టం విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో కుక్కల దాడిలో 35 గొర్రెలు మృతి చెందాయి. ఇటీవలి కాలంలో గొర్రెల మందలపై కుక్కల దాడులు పెరిగిపోయాయి. పది రోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల పరిధిలో కుక్కల దాడిలో రెండు చోట్ల 50కి పైగా గొర్రెలు మృతి చెందాయి. ముస్తాబాద్ మండలంలో నామాపూర్ లో పల్లె గుట్టవద్ద ఉన్న తన పొలంలో చిట్టవేని నరసింహులు […]

మూడున్నర లక్షల నష్టం
విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో కుక్కల దాడిలో 35 గొర్రెలు మృతి చెందాయి. ఇటీవలి కాలంలో గొర్రెల మందలపై కుక్కల దాడులు పెరిగిపోయాయి.
పది రోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల పరిధిలో కుక్కల దాడిలో రెండు చోట్ల 50కి పైగా గొర్రెలు మృతి చెందాయి. ముస్తాబాద్ మండలంలో నామాపూర్ లో పల్లె గుట్టవద్ద ఉన్న తన పొలంలో చిట్టవేని నరసింహులు గొర్రెల మంద పెట్టుకున్నాడు.
ఆ గొర్రెల మందపై శుక్రవారం రాత్రి కుక్కలు దాడి చేయగా సుమారు 35 గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. దీంతో నరసింహులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గొర్రెల మృతితో మూడున్నర లక్షలు నష్టపోయినందున ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.