Gujarat | ఆమెకు బెయిల్ ఇవ్వోద్దు.. గుజ‌రాత్ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విన‌తి

పొలిటిషియ‌న్స్ చేతిలో పావు.. తీస్తా సెత‌ల్వాద్‌ గుజ‌రాత్ ప్ర‌తిష్ట‌ను ఆమె దెబ్బ‌దీస్తున్నారు 2002 అల్ల‌ర్ల కుట్ర కేసులో బెయిల్ ఇవ్వ‌వ‌ద్దు గుజ‌రాత్‌: గుజ‌రాత్‌ (Gujarat)లో 2002 అల్ల‌ర్ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దేశ పౌర హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేయ‌వ‌ద్ద‌ని హైకోర్టును ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కోరింది. ఈ కేసులో ఆమె సాక్ష్యాధారాల‌ను తారుమారు చేసే ప్ర‌మాదం ఉన్నద‌ని గురువారం తెలిపింది. పౌర హక్కుల కార్యకర్తగా, పాత్రికేయురాలుగా, 2002 గుజరాత్ అల్లర్ల బాధితుల […]

  • Publish Date - June 15, 2023 / 07:46 AM IST
  • పొలిటిషియ‌న్స్ చేతిలో పావు.. తీస్తా సెత‌ల్వాద్‌
  • గుజ‌రాత్ ప్ర‌తిష్ట‌ను ఆమె దెబ్బ‌దీస్తున్నారు
  • 2002 అల్ల‌ర్ల కుట్ర కేసులో బెయిల్ ఇవ్వ‌వ‌ద్దు

గుజ‌రాత్‌: గుజ‌రాత్‌ (Gujarat)లో 2002 అల్ల‌ర్ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దేశ పౌర హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేయ‌వ‌ద్ద‌ని హైకోర్టును ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కోరింది. ఈ కేసులో ఆమె సాక్ష్యాధారాల‌ను తారుమారు చేసే ప్ర‌మాదం ఉన్నద‌ని గురువారం తెలిపింది.

పౌర హక్కుల కార్యకర్తగా, పాత్రికేయురాలుగా, 2002 గుజరాత్ అల్లర్ల బాధితుల పక్షాన వాదించేందుకు ఏర్పాటు చేసిన సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) సంస్థకు తీస్తా సెత‌ల్వాద్ కార్యదర్శిగా ఉన్నారు.

2002 అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉన్న‌దని ప్రచారం చేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఇత‌రుల‌ను ఇరికించేందుకు ప్రయత్నించిన‌ట్టుగా తీస్తా సెతల్వాద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

2002లో జరిగిన అల్లర్ల తర్వాత గుజరాత్‌లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిర పరిచే లక్ష్యంతో దివంగత కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ నుంచి ఆమె రూ.30 లక్షలు అందుకున్నారని ప్ర‌భుత్వం త‌ర‌ఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమీన్ పేర్కొన్నారు. గుజరాత్ పరువు తీసే రాజకీయ నాయకుల చేతిలో ఆమె పావుగా మారార‌ని పీపీ వెల్ల‌డించారు.

సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2002లో విషాదకరమైన గోద్రా రైలు ఘటన జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పెద్ద కుట్ర కోణాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌బి శ్రీకుమార్, సంజీవ్ భట్ అనే ఇద్దరు పోలీసు అధికారులతో కలిసి సెతల్వాద్‌ కుట్ర పన్నారని తెలిపారు.