Electric AC Bus | హైదరాబాద్‌-విజయవాడ ఎలక్రిక్‌ ఏసీ బస్సులు ప్రారంభం! ధరల తగ్గింపు

Electric AC Bus | TSRTC విధాత‌: హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో పర్యావరణ హితమైన ఎలక్రిక్‌ ఏసీ బస్సులను (ఈ-గరుడ) టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు కొత్త సర్వీసుల ప్రారంభోత్సవ‌ ఆఫర్‌గా ఒక నెల వరకు ఛార్జీలు తగ్గిస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ ఎ. శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మియాపూర్‌-విజయవాడ రూ. 830గా ఉన్న టికెట్‌ ధర రూ. 760, ఎంజీబీఎస్‌-విజయవాడకు రూ. 780గా ఉన్న […]

  • Publish Date - May 17, 2023 / 02:19 PM IST

Electric AC Bus | TSRTC

విధాత‌: హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో పర్యావరణ హితమైన ఎలక్రిక్‌ ఏసీ బస్సులను (ఈ-గరుడ) టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు కొత్త సర్వీసుల ప్రారంభోత్సవ‌ ఆఫర్‌గా ఒక నెల వరకు ఛార్జీలు తగ్గిస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ ఎ. శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

దీంతో మియాపూర్‌-విజయవాడ రూ. 830గా ఉన్న టికెట్‌ ధర రూ. 760, ఎంజీబీఎస్‌-విజయవాడకు రూ. 780గా ఉన్న టికెట్‌ ధర రూ. 720కి తగ్గింది. అలాగే ఈ-గరుడ బస్సు బయలుదేరే సమయాన్ని కూడా ఆయన వెల్లడించారు. మియాపూర్‌ నుంచి ఉదయం 6.25, ఎంజీబీఎస్‌ నుంచి 8.10, విజయవాడ నుంచి 6.20 కి బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు.

Latest News