Elephant | స్వీట్‌ షాప్‌కు వెళ్లి.. స్వీట్లు లాగించేసిన ఏనుగు (Video)

Elephant | గువాహటి: ఏనుగు (Elephant)లు చూడటానికి శాంతం మూర్తీభవించినట్టు ఉంటాయి కానీ.. రెచ్చగొడితే మాత్రం పీకి పాకం పెడుతుంటాయి. అలాంటి వాటితోపాటు.. ఏనుగులకు సంబంధించిన చాలా వీడియోలు సరదాగానూ ఉంటాయి. అలాంటిదే ఇది. ఎప్పుడూ గడ్డీగాదం తినడమేనా.. కాస్త స్వీట్లు టేస్ట్‌ చేస్తే బాగుండని అనిపించిందేమో.. సదరు గజరాజు ఏకంగా గౌహతిలోని సంరక్షణ నిలయం నుంచి బయటకు వచ్చింది. దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక స్వీట్‌ షాప్‌ కనిపించింది. చక్కగా ఆ షాపు […]

  • Publish Date - June 18, 2023 / 03:51 AM IST

Elephant |

గువాహటి: ఏనుగు (Elephant)లు చూడటానికి శాంతం మూర్తీభవించినట్టు ఉంటాయి కానీ.. రెచ్చగొడితే మాత్రం పీకి పాకం పెడుతుంటాయి. అలాంటి వాటితోపాటు.. ఏనుగులకు సంబంధించిన చాలా వీడియోలు సరదాగానూ ఉంటాయి. అలాంటిదే ఇది.

ఎప్పుడూ గడ్డీగాదం తినడమేనా.. కాస్త స్వీట్లు టేస్ట్‌ చేస్తే బాగుండని అనిపించిందేమో.. సదరు గజరాజు ఏకంగా గౌహతిలోని సంరక్షణ నిలయం నుంచి బయటకు వచ్చింది.

దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక స్వీట్‌ షాప్‌ కనిపించింది. చక్కగా ఆ షాపు ముందు నిలబడి తన తొండాన్ని చాపి.. కావల్సినంత మిఠాయిలు లాగించేసింది.

దారి మధ్యలో తినడానికి అన్నట్టు కొన్నింటిని తొండంతో పట్టుకుని తిరిగి తనుండే వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీకి వెళ్లిపోయింది. ఈ సమయంలో గజరాజు ఎవరినీ ఏమీ చేకుండా తన పని ముగించుకోవడం విశేషం. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Latest News