మాజీ ఎమ్మెల్యే ‘రేపాల’ కొత్త పార్టీ.. ‘సకల జనుల రాజ్యాధికార చైతన్య మిత్ర’

119 అసెంబ్లీ స్థానాల‌కు పోటీ విద్యార్హ‌త ప్ర‌కారం సీఎం ప‌ద‌వి.. విధాత: రాష్ట్రంలో సకల జనుల సమస్యలు పరిష్కారానికి సకల జనుల రాజ్యాధికార చైతన్య మిత్ర పార్టీ ప్రారంభించనున్నట్టు మాజీ ఎమ్మె ల్యే రేపాల శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సకల జనుల ఆందోళన ఫలితంగానే తెలంగాణా రాష్ట్ర‌ అవతరణ జరిగిందని, స్వరాష్ట్రంలో సకల జనులకు ఒరిగిందేమి లేదన్నారు. తెలంగాణ రాక ముందు దళిత సిఎం, నిరుద్యోగ […]

  • Publish Date - February 15, 2023 / 02:38 PM IST
  • 119 అసెంబ్లీ స్థానాల‌కు పోటీ
  • విద్యార్హ‌త ప్ర‌కారం సీఎం ప‌ద‌వి..

విధాత: రాష్ట్రంలో సకల జనుల సమస్యలు పరిష్కారానికి సకల జనుల రాజ్యాధికార చైతన్య మిత్ర పార్టీ ప్రారంభించనున్నట్టు మాజీ ఎమ్మె ల్యే రేపాల శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సకల జనుల ఆందోళన ఫలితంగానే తెలంగాణా రాష్ట్ర‌ అవతరణ జరిగిందని, స్వరాష్ట్రంలో సకల జనులకు ఒరిగిందేమి లేదన్నారు. తెలంగాణ రాక ముందు దళిత సిఎం, నిరుద్యోగ భృతి, రుణ‌మాఫి, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, స్థలముంటే ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, కెజి నుండి పిజి ఉచిత విద్య, అక్రిడేషన్లు అన్నారని ఏ ఒక్కటి రాలేదన్నారు.

బిసి, ఎస్సి, ఎస్టి, ముస్లిం,‌క్రైస్తవ మైనార్టీలు, సకల జనులు అన్యాయానికి గురయ్యారని వారికి రాజ్యాధికారం, అభివృద్ధియే ధ్యేయంగా నూతన పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టానన్నారు. ఆగస్టులో జెండా, ఎజెండా ప్రకటిస్తానన్నారు. పార్టీకి రాష్ట్రంలో శాఖలున్నాయని రానున్న ఎన్నికలలో 119 అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు.

విద్యార్హతలు బట్టి దళితుడు, నిరుద్యోగి, మహిళకు గాని సిఎం పదవి ఇస్తానన్నారు. ఆగస్టులో పార్టీ ఎజెండా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బిసి సంఘం రాష్ట నాయకులు పోలగాని వెంకటేశం గౌడ్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.