Komatireddy | దళిత బంధులో కమీషన్ల దోపిడీ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy బీఆర్ఎస్ నాయకులే సూత్రధారులు సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు, బీసీ బంధు పథకాలు.. బీఆర్ఎస్ నేతలకు కమీషన్లు దోచిపెడుతున్నాయని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సభలో సోనియామ్మ 5 పథకాలను ప్రకటించబోతున్నారు. 17న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరీని విజయవంతం చేయ్యాలి. - ఎంపీ, కోమటిరెడ్డి […]

  • Publish Date - September 11, 2023 / 12:50 AM IST

Komatireddy

  • బీఆర్ఎస్ నాయకులే సూత్రధారులు
  • సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు, బీసీ బంధు పథకాలు.. బీఆర్ఎస్ నేతలకు కమీషన్లు దోచిపెడుతున్నాయని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

ఈమేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ పథకాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కు సంబంధించిన అనర్హులకు మంజూరు చేశారని పేర్కొన్నారు. పలువురు అనర్హులను ఆ లేఖలో ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీలకు ఇచ్చినట్లు తెలిపారు.

తిరుమలగిరిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 180 కోట్లు మంజూరు చేస్తే, 60 కోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పథకాలు పేదలకు అందకుండా పక్కదారి పడుతున్నాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజల్లో బీఆర్ఎస్ తీరును ఎండగడుతామని, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.