Rasi Phalalu: ఫిబ్రవరి 27, గురువారం.. మీ రాశి ఫలాలు! వారికి రావలసిన సొమ్ము అందుతుంది, అనుకున్న పనులు పూర్తి

Rasi Phalalu|
జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి నమ్మకం ఉంది. లేచిన దగ్గరి నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ప్రతీ రోజూ మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. రాశి ఫలాల ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది ఆ రోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల మీద ఈ రోజు గురువారం, ఫిబ్రవరి 27 న మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం
ఆర్థికంగా ఆశించిన పురోగతి. కుటుంబంలో చిన్నచిన్న గొడవలు. పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో కలిసి విందులు. రుణప్రయత్నాలు ఎక్కువ. బంధు, మిత్రుల సహాయ సహకారం ఆలస్యం. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు.
వృషభం
ఉద్యోగ పరంగా శుభ పరిణామాలు. అన్నికార్యాల్లో విజయం. అంతటా సౌఖ్యం. వృత్తి, వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి. కుటుంబంలో వృద్ధి, అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఉద్యోగంలోకి మార్పుకు ప్రయత్నాలు.
మిథునం
ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. పట్టుదలతో కార్యాలు పూర్తి. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు. ఆస్తి సమస్య పరిష్కారం. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారంలో మార్పులు. మనోల్లాసం ఉంటుంది. స్వల్ప అనారోగ్య బాధలు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు.
కర్కాటకం
వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం. మనస్సు చంచలం. బంధు, మిత్రులతో విరోధ అవకాశాలు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు. ఆకస్మిక కలహాలలు. వృథా ప్రయాణాలు. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి. నిల కడగా వ్యాపారాలు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. కుటుంబంపై ఖర్చులు పెరిగే అవకాశం.
సింహం
ఆర్థికంగా అనుకూలం. తలచిన కార్యాలకు ఆటంకాలు. స్థిరాస్తుల సమస్యల్లో జాగ్రత్త అవసరం. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు. మోసపోయే అవకాశాలు. ఆందోళనకరంగా ఆర్థిక పరిస్థితి. ఇష్టమైన బంధుమిత్రులతో కాలక్షేపం. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు. ప్రయాణాలు ఎక్కువ. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.
కన్య
ఆకస్మిక ప్రయాణాలు. చేపట్టిన పనుల్లో, వ్యవహారాల్లో ఆశించిన పురోగతి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ఆకస్మిక ధన ప్రాప్తి అవకాశం. ప్రయాణాలు ఎక్కువ. చేసే పనుల్లో మెలకువగా ఉండాలి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు. స్థానచలనం అవకాశాలు. రుణ లాభం పొందుతారు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు. ఇంటా బయటా మీ మాట, చేత చెల్లుబాటు అవుతుంది.
తుల
వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం. అనారోగ్య బాధలతో సతమతం. స్థానచలనం సూచనలు. రాదనుకున్న డబ్బు చేతికి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబంలో ఆసంతృప్తి. ఆర్థిక లావాదేవీలతో ప్రయోజనం. మానసిక ఆందోళన. గృహంలో మార్పులు కోరుకుంటారు. సామాజికంగా గౌరవ మర్యాదలు. ఆర్థిక ఇబ్బందులు దూరం. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుస్తుంది.
వృశ్చికం
వ్యక్తిగత సమస్య పరిష్కారం. ఆత్మీయుల సహకారం ఆలస్యం. ఆర్థిక ఇబ్బందులతో సతమతం. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం. అజీర్ణ బాధలు అధికం. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. కీళ్లనొప్పులు ఇతర అరోగ్య సమస్యలు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనోవిచారం. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు అనుకూలం.
ధనుస్సు
వృత్తి, వ్యాపారాల్లో రాబడి. కోపం అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఆందోళన ఉంటుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు. దైవధ్యానం అవసరం. అనారోగ్యంతో ఇబ్బందులు. కుటుంబ విషయాల్లో అసంతృప్తి. పెండింగ్ వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. వృధా ప్రయాణాలు అధికం. ధన వ్యయం తప్పదు. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు. ఆరోగ్యం సాఫీగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం.
మకరం
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సులభంగా రుణప్రయత్నాలు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు. ఆశాజనకంగా వ్యాపారాలు. నిలకడగా ఆదాయం. కుటుంబ ఖర్చులు అధికం. బంధు, మిత్రులతో వైరం రాకుండా చూసుకోవాలి. వ్యవహారంలో, చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు. ప్రయాణాల వల్ల లాభం. రోజంతా సాదా సీదాగా సాగుతుంది.
కుంభం
ఆశాజనకంగా వ్యాపారాలు. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి. దైవదర్శనం చేసుకుంటారు. ఇంటా బయటా మంచి గుర్తింపు. కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందం ఉంటుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు. పేరుప్రతిష్ఠలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం. అనుకున్న పనులు పూర్తవుతాయి. శుభవార్తలు. శుభకార్య ప్రయత్నాలు సులభం. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. నిలకడగా ఆరోగ్యం. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలుల్ని పరిష్కారం.
మీనం
రావలసిన సొమ్ము అందుతుంది. అనవసరమైన భయాందోళనలు పోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలనం. గతం కంటే మెరుగ్గా ఆర్థిక పరిస్థితి. రుణప్రయత్నాలు ఎక్కువ. అనారోగ్యం నుంచి ఉపశమనం. ఆత్మీయుల సహకారం ఆలస్యం. ఆదాయంలో వృద్ధి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి. ఉత్సాహంగా ప్రేమ వ్యవహారాలు. ఒకటి రెండు శుభవార్తలు.