Srikalahasti | జనసేన నేతలపై చేయిచేసుకున్న మహిళా సీఐ

Srikalahasti విధాత‌: జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పెళ్లి మండపం వద్ద సీఎం దిష్టిబొమ్మను దగ్థం చేసేందుకు యత్నించిన జనసేన కార్యకర్తలు, నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన మహిళా సీఐ అంజుయాదవ్ వీడియోను ఆ పార్టీ నాయ‌కులు నాదేండ్ల మ‌నోహ‌ర్ ట్వీట్ చేశారు. దీంతో ఇది వైర‌ల్‌గా మారింది. మహిళా సీఐ […]

Srikalahasti | జనసేన నేతలపై చేయిచేసుకున్న మహిళా సీఐ

Srikalahasti

విధాత‌: జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పెళ్లి మండపం వద్ద సీఎం దిష్టిబొమ్మను దగ్థం చేసేందుకు యత్నించిన జనసేన కార్యకర్తలు, నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన మహిళా సీఐ అంజుయాదవ్ వీడియోను ఆ పార్టీ నాయ‌కులు నాదేండ్ల మ‌నోహ‌ర్ ట్వీట్ చేశారు. దీంతో ఇది వైర‌ల్‌గా మారింది. మహిళా సీఐ తీరుపై జనసేన కార్యకర్తల తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేయ‌డంతో పాటు, మాన‌వ‌ హ‌క్కుల‌కు భంగం క‌లిగించిన సిఐపై చ‌ట్ట‌ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.