Fire accident | హనుమకొండ.. శ్రీనివాస కిడ్నీ హాస్పిటలో అగ్ని ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం మంటలు ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది Fire accident | విధాత, వరంగల్ : హనుమకొండలోని వేయి స్తంభాల గుడి ఎదుట శ్రీనివాస కిడ్నీ హాస్పటల్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనలో బెడ్లు అందులోని వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కాగా.. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదంతో అప్రమత్తమై పేషెంట్లను […]

  • Publish Date - August 16, 2023 / 04:55 AM IST
  • తప్పిన పెను ప్రమాదం
  • మంటలు ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది

Fire accident |

విధాత, వరంగల్ : హనుమకొండలోని వేయి స్తంభాల గుడి ఎదుట శ్రీనివాస కిడ్నీ హాస్పటల్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనలో బెడ్లు అందులోని వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

కాగా.. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదంతో అప్రమత్తమై పేషెంట్లను సురక్షిత ప్రాంతానికి ఫైర్ సిబ్బంది తరలించారు. 101 ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసి అదుపులోకి తీసుకొచ్చారు.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.