Telangana | తెలంగాణ నూత‌న స‌చివాల‌యంలో అగ్నిప్ర‌మాదం

Telangana Secretariat | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగ‌ర్ తీరంలో నూత‌నంగా నిర్మిస్తున్న తెలంగాణ స‌చివాల‌యంలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున స‌చివాల‌యం మొద‌టి అంత‌స్తులో మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన వ‌ర్క్ ఏజెన్సీలు.. అగ్నిమాప‌క శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న 11 ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపు చేశాయి. సెక్రటేరియట్‌లో ఉడ్‌ వర్క్స్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ మంటలు చెలరేగినట్లుగా అంతా భావించగా, లోయ‌ర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా […]

Telangana | తెలంగాణ నూత‌న స‌చివాల‌యంలో అగ్నిప్ర‌మాదం

Telangana Secretariat | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగ‌ర్ తీరంలో నూత‌నంగా నిర్మిస్తున్న తెలంగాణ స‌చివాల‌యంలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున స‌చివాల‌యం మొద‌టి అంత‌స్తులో మంట‌లు చెల‌రేగాయి.

అప్ర‌మ‌త్త‌మైన వ‌ర్క్ ఏజెన్సీలు.. అగ్నిమాప‌క శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న 11 ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపు చేశాయి. సెక్రటేరియట్‌లో ఉడ్‌ వర్క్స్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ మంటలు చెలరేగినట్లుగా అంతా భావించగా, లోయ‌ర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

ఓ వైపు జచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో ఈ అగ్నిప్రమాదం జరగడం కలకలం సృష్టిస్తున్నది. అధికారులు, నిర్మాణ సంస్థ యాజమాన్యం ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలుసుకుంటున్నారు.

అయితే ఈ నెల 17వ తేదీన తెలంగాణ నూత‌న స‌చివాల‌యాన్ని ప్రారంభించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఇటీవ‌లే స‌చివాల‌యాన్ని ప‌రిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను పది రోజుల్లో పూర్తి చేయాల‌ని ఏజెన్సీల‌కు సూచించారు.

సచివాల‌యం ప్రారంభోత్స‌వానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ , జేడీ(యు) చీఫ్ లలన్ సింగ్ , అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.