బ్రేకింగ్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పులు

విధాత: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తూ ఆయన అద్వర్యంలో లాహోర్ నుండి ఇస్లామాబాద్ వరకు లాంగ్ మార్చ్ జరుగుతోంది. ఈ క్రమంలో వజీరాబాద్ వద్ద గుర్తు తెలియని దుండగులు గురువారం ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్ళడంతో ఆయన తీవ్ర౦గా గాయపడ్డారని అల్ జజీరా న్యూస్ పోర్టల్ తెలిపింది. వజీరాబాద్ లోని అల్లావాలా చౌక్‌లో ఈ సంఘటన […]

  • By: krs    latest    Nov 03, 2022 12:26 PM IST
బ్రేకింగ్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పులు

విధాత: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తూ ఆయన అద్వర్యంలో లాహోర్ నుండి ఇస్లామాబాద్ వరకు లాంగ్ మార్చ్ జరుగుతోంది. ఈ క్రమంలో వజీరాబాద్ వద్ద గుర్తు తెలియని దుండగులు గురువారం ఆయనపై కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్ళడంతో ఆయన తీవ్ర౦గా గాయపడ్డారని అల్ జజీరా న్యూస్ పోర్టల్ తెలిపింది. వజీరాబాద్ లోని అల్లావాలా చౌక్‌లో ఈ సంఘటన జరిగినట్టు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నాయకుడు అజర్ మశ్వాని తెలిపారు.

ఈ సంఘటనలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కి చెందిన పలువురు నాయకులు గాయ పడ్డారని, వెంటనే నిందితుడిని అరెస్టు చేశారని పోలీసులను ఉటంకిస్తూ పాకిస్తాన్ కు చెందిన జియో న్యూస్ తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ని వెంటనే లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఏమీ లేదని అల్ జజీరా తెలిపింది.