గ్లాసులో పటాకులు కాల్చొద్దన్నందుకు హత్య చేశారు
విధాత: దీపావళి అంటేనే పటాకులు గుర్తొస్తాయి. పిల్లలైతే తీరిక లేకుండా బాణసంచా కాల్చుతుంటారు. కొంతమంది పిల్లలైతే ఇతరుల ఇండ్ల ముందు, రోడ్లపై కాల్చి పైశాచిక ఆనందం పొందుతారు. ఆ మాదిరిగానే ఓ బాలుడు కూడా గాజు గ్లాసులు పటాకులు పెట్టి కాల్చుతున్నాడు. దాని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన ఓ వ్యక్తి.. అలా చేయొద్దని సూచించాడు. దీంతో అతనితో గొడవ పడి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన […]

విధాత: దీపావళి అంటేనే పటాకులు గుర్తొస్తాయి. పిల్లలైతే తీరిక లేకుండా బాణసంచా కాల్చుతుంటారు. కొంతమంది పిల్లలైతే ఇతరుల ఇండ్ల ముందు, రోడ్లపై కాల్చి పైశాచిక ఆనందం పొందుతారు. ఆ మాదిరిగానే ఓ బాలుడు కూడా గాజు గ్లాసులు పటాకులు పెట్టి కాల్చుతున్నాడు.
దాని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన ఓ వ్యక్తి.. అలా చేయొద్దని సూచించాడు. దీంతో అతనితో గొడవ పడి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని శివాజీ నగర్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
శివాజీ నగర్‌లో సోమవారం రాత్రి ఓ బాలుడు(12) పటాకులు కాల్చుతున్నాడు. అయితే కొన్ని పటాకులను గాజు గ్లాసులో పెట్టి కాల్చుతున్న దృశ్యాలను సునీల్ శంకర్(21) అనే వ్యక్తి చూశాడు.
పటాకులతో పాటు గ్లాసు కూడా పగిలితే ప్రమాదం ఉంటుందని భావించిన శంకర్.. అలా కాల్చొద్దని బాలుడికి సూచించాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
గొడవ జరుగుతుండగానే బాలుడి అన్నతో పాటు మరో స్నేహితుడు అక్కడ వాలిపోయారు. శంకర్‌పై కత్తితో దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు కూడా మైనర్లే. వీరిలో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు