గాల్లో తేలుతూ.. CM KCRకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన వీరాభిమాని

విధాత: సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వ్యక్తం చేయడంలో అభిమానులు ఆకాశమే హద్దుగా సాగుతున్నారు. వినూత్నమైన పద్దతుల్లో తమ అభిమానం చాటుకున్నారు. ఆ కొవకు చెందిన వ్యక్తే  అమెరికాలో ఉండే కేసీఆర్ వీరాభిమాని సంతోష్ రాకొండ్ల. శుక్రవారం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా తన ఆకాశమంత అభిమానాన్ని ఏకంగా స్కై డైవింగ్‌తో చాటుకున్నారు. తెలంగాణ ఫ్టాగ్‌లో సీఎం కేసీఆర్ బొమ్మతో కూడిన జెండాను పట్టుకొని చాపర్ నుంచి నేకిందకు జంప్‌ చేశాడు. గాలిలో ఉండగానే రెండు చేతులతో బీఆర్‌ఎస్‌, […]

  • By: krs    latest    Feb 17, 2023 1:04 PM IST
గాల్లో తేలుతూ.. CM KCRకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన వీరాభిమాని

విధాత: సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వ్యక్తం చేయడంలో అభిమానులు ఆకాశమే హద్దుగా సాగుతున్నారు. వినూత్నమైన పద్దతుల్లో తమ అభిమానం చాటుకున్నారు. ఆ కొవకు చెందిన వ్యక్తే అమెరికాలో ఉండే కేసీఆర్ వీరాభిమాని సంతోష్ రాకొండ్ల.

శుక్రవారం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా తన ఆకాశమంత అభిమానాన్ని ఏకంగా స్కై డైవింగ్‌తో చాటుకున్నారు. తెలంగాణ ఫ్టాగ్‌లో సీఎం కేసీఆర్ బొమ్మతో కూడిన జెండాను పట్టుకొని చాపర్ నుంచి నేకిందకు జంప్‌ చేశాడు.

గాలిలో ఉండగానే రెండు చేతులతో బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌లు ఉన్న జెండాను పట్టుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పారాచూట్ సాయంతో క్షేమంగా నేలపై దిగారు. స్కై డైవింగ్‌తో కేసీఆర్‌పై తన అభిమానాన్ని చాటిన సంతోష్ రాకొండ్ల సాహసోపేతమైన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.